Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

Shankarpally : వండర్ బుక్ ఆఫ్ రికార్డులోకి శంకర్‌పల్లి బృంద నృత్యం..!

మానుకోట ప్రసాద్ రచించిన, ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ గానం చేసిన రైతే రాజు, రైతుకు వందనం' నృత్యానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం లభించింది. శనివారం రాత్రి నగరంలోని ఎల్బీ స్టేడియంలో శ్రీ సాయి అలేఖ్య ఆర్ట్స్, వీవీకే విజన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శంకర్‌పల్లి పట్టణానికి చెందిన సంస్కృతి నృత్యాలయం గురువు అనుషా రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన నృత్యానికి వరల్డ్ రికార్డు సొంతమైంది.

Shankarpally : వండర్ బుక్ ఆఫ్ రికార్డులోకి శంకర్‌పల్లి బృంద నృత్యం..!

శంకర్‌పల్లి (మన సాక్షి):

మానుకోట ప్రసాద్ రచించిన, ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ గానం చేసిన రైతే రాజు, రైతుకు వందనం’ నృత్యానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం లభించింది. శనివారం రాత్రి నగరంలోని ఎల్బీ స్టేడియంలో శ్రీ సాయి అలేఖ్య ఆర్ట్స్, వీవీకే విజన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శంకర్‌పల్లి పట్టణానికి చెందిన సంస్కృతి నృత్యాలయం గురువు అనుషా రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన నృత్యానికి వరల్డ్ రికార్డు సొంతమైంది.

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్.. శ్రీ సాయి అలేఖ్య ఆర్ట్స్ సంస్థ వ్యవస్థాపకురాలు సాయి అలేఖ్య, వీవీకే విజన్ సంస్థ ఎండీ విజయ్ కుమారు.. ఈ రికార్డును శ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి మాట్లాడుతూ, పండించిన పంటను ప్రజలకు అందించడమే రైతుల లక్ష్యమని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారని అన్నారు.

కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది వెంకటేశ్వరి అధ్యక్షత వహించగా, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రైతులు రాజవర్ధన్ రెడ్డి, గాదె రాజశేఖర్, వెంకట్, వెంకట నరసమ్మ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్‌పల్లి పట్టణానికి చెందిన విద్యార్థినుల నృత్యాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన వారిలో ఎం లిర్తిక రితన్య, గౌండ్ల రిత్విక, కనకంటి రుథాన్షి నారాయణ్, టీ మాన్వి, మాసగొని నిత్య, వై రియాన్షి, హర్షిత, ముత్యం మనుశ్రీ, సానికే అవంతిక ఉన్నారు.

MOST READ : 

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు