Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య..!

Miryalaguda : భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య..!

మిర్యాలగూడ, మన సాక్షి :

భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం..

త్రిపురారం మండలం దుగ్గేపల్లి గ్రామానికి చెందిన కళిమెల స్వప్న (30 )భర్త రమేష్ తో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని అంజయ్య నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. కాగా ఆమె భర్త మద్యం తాగి ఆమెపై అనుమానంతో మానసికంగా శారీరకంగా వేధిస్తుండేవాడు.

దాంతో ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

LATEST UPDATE : 

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

నిర్మల్ లో ఘోరం.. వైద్యం వికటించి 12 ఏళ్ల బాలిక మృతి..!

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!

Gold : రూ.25 వేలకే తులం బంగారం.. కేంద్రం సరికొత్త ఆలోచన..!

మరిన్ని వార్తలు