Miryalaguda : గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాతో మిర్యాలగూడ యువకుల లింకు..!
Miryalaguda : గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాతో మిర్యాలగూడ యువకుల లింకు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నిందితులను అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు. శుక్రవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన భూక్యా హనుమా నాయక్, సింగాల కాటం రాజు, నర్సరావుపేట జిల్లా, కారంపూడి కి చెందిన మద్దూరి చంటి లు గంజాయి మరియు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారంతా ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు.
వారి జల్సాల కోసం బలిమెల, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆనంద్ గురు వద్ద నుండి గంజాయి ని కొనుగోలు చేసి అధిక ధరకు అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే, వీరికి గంజాయి అలవాటు ఉన్న మిర్యాలగూడ కు చెందిన కొందరు వ్యక్తులు పరిచయం కాగా, వారికి కూడా గంజాయి ని బలిమెల నుండి తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. వారి నుండి మిర్యాలగూడ వారు గంజాయి ని కొని అధిక ధరలకు ఇతరులకు అమ్ముతున్నారు.
ఈనెల 7న భూక్యా హనుమానాయక్, సింగాల కాటంరాజు , మద్దూరి చంటి పోతురాజు లు రెండు గ్రూపులుగా విడిపోయి, మద్దూరి చంటి తన బైకు మీద అందాజ రెండు నుండి రెండున్నర కిలోలతో మరియు భూక్యా హనుమా నాయక్ మరియు సింగాల కాటంరాజు లు కారులో అందాజ ఐదు నుండి ఐదున్నర కిలోల గంజాయితో మిర్యాలగూడ టౌన్ కు వచ్చి వారి కస్టమర్ల కు అందజేస్తున్నారన్న నమ్మకమైన సమాచారం మేరకు వారి కస్టమర్ల అయ్యిన మహమ్మద్ హర్షద్ అయూబ్, మహమ్మద్ సలీం అత్తర్, మహమ్మద్ జునైద్, షేక్ అప్రోచ్, కుర్ర సందీప్, భూక్య హనుమ నాయక్ లను పట్టుబడి చేశారు.
వారి వద్ద నుండి 7.4 కిలోల గంజాయి ని, ఒక కారు, మూడు మోటార్ సైకిళ్ళు మరియు 10 సెల్ ఫోన్ లను స్వాధీన చేసుకొని కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. యస్.పి శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డి.ఎస్.పి రాజశేఖర రాజు ఆధ్వర్యంలో ఇట్టి కేసును చేదించిన మిర్యాలగూడ టూ టౌన్ సి.ఐ జే. సోమనర్సయ్య, మిర్యాలగూడ రూరల్ ఎస్.ఐ లక్ష్మయ్య, మిర్యాలగూడ 2 టౌన్ ఎస్. ఐ రాంబాబు మరియు హెడ్ కానిస్టేబుల్ ఎస్. యాదగిరి రెడ్డి, కానిస్టేబుల్లు సూర, బాలకృష్ణ,అక్బర్ పాషా, లక్ష్మయ్య,రాజ శేఖర్,సమాద్, హెచ్.జి వెంకన్న, మహేశ్, సైదులు,నాగరాజు, రాములు నాయక్ మరియు సైదా నాయక్ లను మిర్యాలగూడ డి.ఎస్.పి అభినందించారు.
MOST READ :
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!
-
Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!
-
SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!
-
Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!









