BIG BREAKING : తప్పిపోయిన గురుకుల విద్యార్థుల ఆచూకీ లభ్యం..!
BIG BREAKING : తప్పిపోయిన గురుకుల విద్యార్థుల ఆచూకీ లభ్యం..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ మైనార్టీ పాఠశాల ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యం అయ్యింది. మంగళవారం ఉదయం సుమారు 8:00 కు పాఠశాలలో విద్యార్థులు తౌఫిక్, అబ్దుల్ రెహమాన్ , ముజ్జీబ్ మిస్సింగ్ అయినారు .
పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవరకొండ డి.ఎస్.పి గిరిబాబు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి రంగంలో దింపారు. పోలీసులు ట్రేస్ చేసి ఆచూకీ లభ్యం చేసుకున్నారు. బుదవారం అర్దరాత్రి 12 :30 మిస్సింగ్ ఆచూకీ లభ్యం జరిగింది. మాల్ నుండి హైదరాబాద్ దారిలో మాల్ లో దొరికినట్లు తెలిసింది. విద్యార్థులకు దేవరకొండ పోలీస్ స్టేషన్ కు తీసుకోరావడం జరిగింది.
మిస్సింగ్ విద్యార్థుల కోసం దేవరకొండ సీఐ నరసింహులు , కొండమల్లేపల్లి సిఐ ధనంజయ, దేవరకొండ ఎస్సై అజ్మీర రమేష్, నల్గొండ జిల్లా స్పెషల్ టీం బృందం విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో ట్రేస్ చేసి సురక్షితంగా తీసుకురావడం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలు అందరూ, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ అధికారులకు అభినందనలు తెలుపుతున్నారు.









