Breaking Newsక్రైంహైదరాబాద్

Hyderabad : హత్య కేసును చేదించిన మియాపూర్ పోలీసులు..!

Hyderabad : హత్య కేసును చేదించిన మియాపూర్ పోలీసులు..!

శేరిలింగంపల్లి, మన సాక్షి :

శేరిలింగంపల్లి మియాపూర్ లిమిట్స్ హఫీజ్ పెట్ రైల్వే స్టేషన్ వద్ద ఈ నెల 5 న ఓ గుర్తుతెలియని. వ్యక్తి చనిపోయినట్లు సమాచారం అందింది కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు చనిపోయిన వ్యక్తి ని మహారాష్ట్ర కు చెందిన కేశవ్ బంగర్( 39 ) గుర్తించారు.

అయితే ఈ హత్య కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న మియాపూర్ ఇన్స్ పెక్టర్ క్రాంతి కుమార్ తన బృందం తో పాటు ఎస్ ఓ టీ మాదాపూర్.జోన్ ఇన్స్ పెక్టర్ ఎన్ సంజయ్ తన బృందం తో కలసి తమదైనా శైలిలో విచారణ చేపట్టి నిందితులను పట్టుకోవడం జరిగింది.

ఈ విషయం పై మీడియా సమావేశం నిర్వహించిన ఏసీపీ నరసింహ రావు మాట్లాడుతూ
ఈ నెల 5 న హఫీజ్ పెట్ రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసుకు సంబంధించి సమాచారం అందటం తో. వెంటనే స్థానిక పోలీస్ ఇన్స్ పెక్టర్ క్రాంతి కుమార్ వాళ్ళ సిబ్బందితో కలసి వెళ్లి దర్యాప్తు చేపట్టటం జరిగింది.

చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు కాకపోతే తల పగిలి చనిపోవడం తో ఇది కచ్చితంగా హత్య జరిగిందని నిర్ధారించి కేసు నమోదు చేసుకోనీ దర్యాప్తు ప్రారభించిన ఈ కేసులో మఖ్యాంగ మియాపూర్ ఇన్స్ పెక్టర్ క్రాంతి కుమార్ .నర్సింహ రెడ్డి . రాజేశ్వర్ రెడ్డి మరియు మాదాపూర్ ఎస్ ఓ టి ఇన్స్ పెక్టర్ . ఎన్ సంజయ్ వారి సిబ్బంది ఈ కేసును ఛాలెంజింగా తీసుకొని విచారణ చేపట్టి టెక్నికల్ క్లూస్ తో. మాన్యువల్ గా అందరినీ కలసి ఏం జరిగింది.

అని విచారించగా స్థానికంగా ఉండేవారి సమాచారం మేరకు శుక్రవారం నాడు ఉదయం హఫీజ్ పెట్ లేబర్ అడ్డా వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవటం జరిగిందని అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించగా..

ఎవరైతే చనిపోయిన వ్యక్తి పేరు కేశవ్ బంగర్ అని అతను మహారాష్ట్ర కు చెందిన వ్యక్తి అని అతను అక్కడ షుగర్ పరిశ్రమలో పని చేసేవాడని అక్కడ పని నచ్చక పోవడం తో 15 రోజులక్రితమే ఇక్కడ హఫీజ్ పేట కు వచ్చి హఫీజ్ పెట్ రైల్ వే స్టేషన్ లో ఉంటు లేబర్ అడ్డాలో దొరికిన పని చేసుకుంటూ ఉండేవాడని అయితే ఈ నెల 3 వ తారీకున మృతుడికి ఎటువంటి పని దొరకకపోవడం తో ఈ ముగ్గురు నిందితులైన 1 )గందె సుమిత్ (23) 2 ) సునీల్ మద్దనీకర్ (25) 3 ) ప్రేమ్ సాగర్ నౌద్గి (24 ) ఈ ముగ్గురు కూడా కర్ణాటకాకు సంబంధించిన వ్యక్తులు ఇదే లేబర్ అడ్డాలో లేబర్ పనికోసం వస్తుంటారు.

ఆ విధంగా 3 వా తారీఖు నాడే మృతుడితో ఈ ముగ్గురికి పరిచయం ఏర్పడింది ఆ రోజు ఎవరికి కూడా పనిలేకపోవడం తో విరందరు సాయంత్రం ఒక దగ్గర కలుసుకుని ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతనికి మద్యం సేవించె అలవాటు ఉంది అవిధంగా గందె సుమిత్. సునీల్ మద్దనీకర్ లు మద్యం తాగుదామని అనడం తో ఎవరివద్ద డబ్బులు లేకపోవడం తో ఈ ముగ్గురు కలసి కేశవ్ బంగార్ ను అడగటం తో అతనివద్ద డబ్బులు లేకపోవటం తో మృతుడి ఫోన్ ని ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం మళ్లీ విడిపించుకుందాం అనడం తో సరే అని ఒక దగ్గర తకట్టు పెట్టి 3వ తారీఖున రాత్రికి తాగటంజరిగింది

తిరిగి యదావిధిగా 4 వ తారీఖు నా ఎవరికి వారు లేబర్ అడ్డకు చేరూకోనీ సాయంత్రం వరకు పనులు ముగించుకుని మళ్లీ. సాయంత్రం 7 గంటల సమయం లో గందె సుమిత్.సునీల్ మద్దనీకర్ లు రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలం లో కూర్చొని మద్యం సేవిస్తున్నారు ఆ సమయం లో మద్యం సేవించి ఉన్న మృతుడు కేశవ్ బంగర్ తన మొబైల్ ఫోన్ తనకు విడిపించి ఇవ్వాల్సిందిగా కోరడం తో వారి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది.

దీంతో మృతుడు వారిద్దరిని కొట్టగా వారు అక్కడినుండి వెళ్లి మూడవ వ్యక్తి కి తెలపడంతో అతను 8 గంటల సమయం లో కేశవ్ ను పిలిచి ప్రశ్నించగా మళ్లీ వివాదం మొదలై ముగ్గురు కలసి కేశవ్ బంగర్ పై సిమెంటు ఇటుకలతో దాడి చేయ్యాటంతో మృతుడు అక్కడిక్కడే మృతి చెందాడని తెలిపారు.

ఈ కేసును ఛేదించిన మియాపూర్ ఇన్స్ పెక్టర్ క్రాంతి కుమార్ బృందాన్ని మరియు ఎస్ ఓ టి మాదాపూర్ ఎన్ సంజయ్ బృందాన్ని అభినందించిన ఏసీపీ నరసింహ రావు .మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం. మాదాపూర్ డీసీపీ వినీత్ లు వారికి త్వరలో రివార్డ్ అందజేయడం జరుగుతుంది అని తెలిపారు.

MOST READ  :

మరిన్ని వార్తలు