Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

MLA : వ్యవసాయం పనుల్లో ఎమ్మెల్యే.. తరలి వచ్చిన కార్యకర్తలు..!

MLA : వ్యవసాయం పనుల్లో ఎమ్మెల్యే.. తరలి వచ్చిన కార్యకర్తలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మంగళవారం వ్యవసాయ పనుల్లో తోటి కూలీలతో కలిసి పనిచేశారు. ట్రాక్టర్ తో దమ్ము చేసి వరి నాట్లు వేశారు. మిర్యాలగూడ మండలం తక్కెళ్ళపాడు లో మంగళవారం ఆయన తోటి కూలీలతో కలిసి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఆయన రైతులకు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు రైతులతో కలిసి వ్యవసాయ పనుల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతన్నల కష్టాన్ని రైతుగా మారినప్పుడే పూర్తిగా అర్థం అవుతుందని అన్నారు.

మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్నపూర్ణగా పిలుస్తారని, ఆ పేరు రావడానికి రైతన్నల పాత్ర కీలకం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నుంచి రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు 500 బోనస్ ఇలా అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ రైతు ప్రభుత్వంగా రైతుల పక్షాన పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా కేవలం వందల ఎకరాలు ఉన్న భూసాములను ప్రభుత్వ ధనంతో పోషించిందని అన్నారు.

కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నర లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, క్యాబినెట్ ఏకాభిప్రాయంతో రాష్ట్రంలో రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు , బీసీ రిజర్వేషన్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇలా అనేక సంక్షేమాలను పేదలకు అందించిందని అన్నారు.

ప్రజా పాలన అందిస్తున్న మన ప్రజా ప్రభుత్వానికి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని, సంక్షేమాలను ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పి కొట్టాలి అని కోరారు.

మరిన్ని వార్తలు