MLA : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను మంజూరు చేయడంలో వివక్షత చూపుతోందని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLA : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
శివంపేట, మన సాక్షి :
గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను మంజూరు చేయడంలో వివక్షత చూపుతోందని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివంపేట మండలంలోని ఐకెపి అంగన్వాడి భవనాల నిర్మాణాలకు ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి భూమి పూజ చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి చెప్పారు.
గ్రామ సర్పంచ్ కల్లూరి హనుమంతరావు. మాజీ సర్పంచ్ కల్లూరి కీర్తన హనుమంతరావు. మాజీ ఎంపీపీ హరికృష్ణ. కల్లూరి వెంకటేశం. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్. ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణా గౌడ్. ఉప సర్పంచ్ మేకల యాదిరెడ్డి సునంద రెడ్డి. నాయకులు మర్రి మహేందర్ రెడ్డి కొడకంచి అశోక్ గౌడ్. ముందుగా ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు









