తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలురాజకీయం

MLA : మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే సంజయ్ కీలక ప్రకటన.. రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దు..!

MLA : మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే సంజయ్ కీలక ప్రకటన.. రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దు..!

జగిత్యాల, (మన సాక్షి) :

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగపూర్ గ్రామంలో 35 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం 13 లక్షలతో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శంకుస్థాపన చేసారు.

గ్రామంలో పోచమ్మ, హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్, చాకలి ఐలమ్మ, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి  నాయకత్వం లో గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని మాస్టర్ ప్లాన్ తో రైతుల భూములకు ఎట్టిపరిస్థితుల్లో నష్టం కానివ్వం, కొందరు స్వలాభం కోసం రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తారు. వారి మాటలు నమ్మవద్దు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా అన్నారు.

గ్రామ అభివృద్ది కి మరిన్ని నిధులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం లో రేషన్ కార్డు లు మంజూరు చేశాం.ప్రజల ఆహార భద్రత అమలుకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం ఉచిత కరెంట్, సబ్సిడీ సిలిండర్, ఉచిత బస్, మహిళ సంఘాల ఆర్థిక బలోపేతం అనేక కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి.

మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు 20 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది. 50 కోట్ల తో జగిత్యాల పట్టణం అభివృద్ధి,అర్బన్ హౌసింగ్ కాలనికి 20 కోట్ల నిధులు మంజూరు. 5 కోట్ల తో టి ఆర్ నగర్ వద్ద  ఏ టి సి  కేంద్రం నిర్మాణం దాదాపు పూర్తి అయిందని ఉపాధి , వృత్తి నైపుణ్యానికి చాలా ఉపయోగం అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రమాదేవి, ఎమ్మెర్వో శ్రీనివాస్, ఎఈ రాజమల్లయ్య, సీనియర్ నాయకులు ముసుకు ఎల్లారెడ్డి, పాలేపు రాజేంద్ర ప్రసాద్, బాల ముకుందం, నారాయణ రెడ్డి, మాజీ సర్పంచులు గడ్డం సరోజనా మల్లారెడ్డి జగడం నరేష్  గంగాధర్ నక్కల రవీందర్ రెడ్డి నరేష్ రాజేశ్వర్ రెడ్డి , ప్రకాష్,అంకం సతీష్,నాయకులు తిరుపతి, కూడుకల లక్ష్మణ్,రాజా నరసయ్య, గ్రామ మండల నాయకులు, అధికారులు, మహిళలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. వారి ఫిర్యాదుల పట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలి..!

  2. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!

  3. TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

  4. Gold Price : భారీగా తగ్గిన గోల్డ్.. ఈరోజు రేట్లు..!

  5. CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. వారికి 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా..!

మరిన్ని వార్తలు