Miryalaguda : మున్సిపల్ అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే వార్నింగ్.. ఇక డే బై డే సమీక్ష..!
Miryalaguda : మున్సిపల్ అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే వార్నింగ్.. ఇక డే బై డే సమీక్ష..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ అధికారులు, సిబ్బంది పనులలో నిర్లక్ష్యం చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హెచ్చరించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో దోమల అధికంగా ఉన్నాయని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రధాన కాలువ జెసిబిలు పెట్టి శుభ్రం చేయాలని సూచించారు. నీటి సమస్య ఎక్కడ ఉన్నా తక్షణమే పరిష్కరించాలన్నారు.
వీధిలైట్లు లేని ప్రతి వార్డులో అతి త్వరగా లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మిర్యాలగూడ పట్టణంలోని రద్దీగా ఉండే ప్రాంతాలైన డాక్టర్స్ కాలనీ, కూరగాయల మార్కెట్, బస్టాండు ఇతర ప్రాంతాలలో డ్రైనేజీ గాని చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలని సూచించారు.
ప్రతి సమావేశంలో కూడా చెప్పడమే కానీ చర్యలు కనిపించడం లేదని ఇకపై 48 గంటలకు ఒకసారి డే బై డే మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఉంటుందన్నారు. ప్రతిరోజు చేసే పనులపై అప్డేట్ తెలియజేయాలని, మూడు నెలల్లో మిర్యాలగూడ పట్టణంలో మార్పు రావాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పనిచేయాలన్నారు.
MOST READ :
-
Holidays : పాఠశాలలకు వేసవి సెలవులు.. ఆ.. ముందే విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు..!
-
Miryalaguda : నకిలీ షూరిటీ లు కోర్టు లో పెట్టినందుకు జైలు శిక్ష, జరిమానా..!
-
SBI : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..!
-
Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)
-
Liquor : మద్యం ప్రియులకు భారీ షాక్..!









