మిర్యాలగూడలో విషాదం , గర్భిణీ మృతి – LATEST NEWS

మిర్యాలగూడలో విషాదం , గర్భిణీ మృతి – LATEST NEWS

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన ..!

మిర్యాలగూడ, (నల్గొండ) , మనసాక్షి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో విషాదం నెలకొన్నది. నెలలు నిండిన గర్భిణీ మృతి చెందగా డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేసిన సంఘటన గురువారం రాత్రి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని చర్చిరోడ్డులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం .. పెద్ధవూర మండలం ఊరబాయి తండాకు చెందిన రూపావత్ మంజుల(19) 9 నెలల నిండు గర్భిణీ. కాగా సాధారణ పరీక్షల నిమిత్తం గురువారం ఉదయం అనిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకొచ్చారన్నారు.

మృతురాలు ఫైల్ ఫోటో

ALSO READ BREAKING : భద్రాచలం గోదావరి బ్రిడ్జి పై రాకపోకలు బంద్, 144 సెక్షన్

అనంతరం ఇంటికి తీసుకెళ్లారన్నారు. ఆయాసం వస్తుండటంతో తిరిగి ఆస్పత్రికి తీసుకొస్తుండగా మార్గమద్యలో మృతి చెందిందన్నారు. కాగా వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మరణించిందని ఆస్పత్రి వద్ధ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇదే విషయమై ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ గర్బిణీ మహిళకు అవసరమైన వైద్య సహాయం అందించామన్నారు. ఆమె చనిపోవడంలో తమ తప్పేమీ లేదన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇరువర్గాలకు సంబంధించిన పెద్ధ మనుషులు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని చెప్పటంతో ఆందోళన విరమించారు.