Gold Price : పసిడి ప్రియులకు మరింత ఆనందం.. దిగివచ్చిన బంగారం ధరలు..!
Gold Price : పసిడి ప్రియులకు మరింత ఆనందం.. దిగివచ్చిన బంగారం ధరలు..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
పసిడి ధరలు రోజురోజుకు దిగి వస్తున్నాయి. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియుల్లో ఆనందం కలుగుతుంది. కార్తీకమాసం ప్రారంభమైన నాటి నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
దాంతో మహిళలు బంగారం కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీపావళికి ముందు భారీగా పెరిగిన బంగారం ధరలు.. కార్తీక మాసం ప్రారంభం నుంచే తగ్గుముఖం పట్టాయి. ఇటీవల భారీగా బంగారం ధరలు తగ్గడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 4,400 తగ్గింది. 22 క్యారెట్స్ బంగారం కు 100 గ్రాములకు రూ. 4000 తగ్గింది. బంగారం ధర భారీగా తగ్గడంతో మహిళలు ఆనందంలో ఉన్నారు.
ఈ సీజన్ లో బంగారం ధర తగ్గటం కావడం విశేషం. నవంబర్ 7వ తేదీన 100 గ్రాములకు 17,900 తగ్గిన బంగారం , 12వ తేదీన 14,500 తగ్గింది. 13వ తేదీన 24 క్యారెట్స్ 100 గ్రాములకు 4400 రూపాయలు, 22 క్యారెట్స్ 4000 రూపాయల ధర తగ్గింది. కాగా 10 గ్రాముల (తులం బంగారం) 24 క్యారెట్స్ కు 440 రూపాయలు, 22 క్యారెట్ కు 10 గ్రాముల (తులం బంగారం) 400 రూపాయల ధర తగ్గింది.
బుధవారం (నవంబర్ 13)వ తేదీన 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం 4,400 రూపాయలు తగ్గింది. మంగళవారం (నవంబర్ 12)వ తేదీన 7,72,900 రూపాయల ధర ఉండగా బుధవారం (13నవంబర్)వ తేదీన 7,68,500 రూపాయల ధర ఉంది.
22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు రూ. 4,000 తగ్గింది. మంగళవారం (నవంబర్ 12)వ తేదీన 7,08,500 రూపాయల ధర ఉండగా బుధవారం (నవంబర్ 13)వ తేదీన 7,04,500 రూపాయల ధర ఉంది.
హైదరాబాద్ లో బంగారం ధర (13-11-2024)
24 క్యారెట్స్ :
ఒక గ్రాముకు 7685 రూపాయలు
8 గ్రాములకు 61,480 రూపాయలు
10 గ్రాములకు 76,850 రూపాయలు
100 గ్రాములకు 7,68,500 రూపాయలు
22 క్యారెట్స్ :
ఒక గ్రాముకు 7,045 రూపాయలు
8 గ్రాములకు 56,360 రూపాయలు
10 గ్రాములకు 70,450 రూపాయలు
100 గ్రాములకు 7,04,500 రూపాయలు.
MOST READ :









