సూర్యాపేట : మున్సిపాలిటీ వారి సర్క్యులర్.. భగ్గుమంటున్న రాజకీయ నాయకులు..!

సూర్యాపేట : మున్సిపాలిటీ వారి సర్క్యులర్ కు

భగ్గుమంటున్న రాజకీయ నాయకులు..!

సూర్యాపేట , మనసాక్షి :

సూర్యాపేట మున్సిపల్ పరిధిలో ఫ్లెక్సీలు ,సైన్ బోర్డుల ప్రదర్శన ల పైన నిషేధం విధిస్తూ మున్సిపల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయం పట్ల వి వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట పట్టణంలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు , సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే అట్టి ఫ్లెక్సీలు ప్రధాన కూడళ్ళలో పెద్ద సైజుల్లో ఏర్పాటు చేస్తున్నారు.

 

దాని మూలంగా పట్టణంలోని వాహనదారులకు ,ప్రజలకు అడ్డంగా ఉండటంతో ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. ఈ విషయం పైన ప్రజల నుండి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందాయని అధికారులు పేర్కొంటున్నారు.

 

అయితే సూర్యాపేట పట్టణంను నందనవనం గా తీర్చిదిద్దామని అయితే ఈ ఫ్లెక్సీల మూలంగా ఆ అందం అంత పోతుందని చెపుతున్నారు. మున్సిపల్ అధికారులు. అయతే ఫ్లెక్సీల ప్రదర్శనను నిషేధిస్తూ మున్సిపల్ కమిషనర్ అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ,ప్రజా సంఘాల,ఫ్లిక్సీ ప్రింటింగ్ యజమానులకు ఈనెల 26వ తేదీన సర్కులర్ జారీ చేస్తూ నోటీసు లు అందజేశారు.

 

మున్సిపల్ పరిధిలో ఫ్లెక్సీలు పెట్టాలని అనుకుంటే ముందుగా మా అధికారుల అనుమతి పొందాలని అందులో పొందుపరిచారు. ఫ్లెక్సీల నిషేధంపై మున్సిపల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు అభ్యంతరము వ్యక్తం చేస్తున్నారు.

 

అధికార పార్టీ వారికి కమిషనర్ అనుకూలంగా వుంటూ , ఇతర రాజకీయ పార్టీల నాయకులను ఇబ్బందే పెట్టె విదంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

 

గతంలో ను ఫ్లెక్సీల వాడకాన్ని , ప్లాస్టిక్ కవర్లు , వాడకంపైన నిషేధం విధించారు. అయితే నిషేధం మున్నాళ్ల ముచ్చటగా నే మిగిలిందని. మరి ఈ సారి తీసుకున్న నిర్ణయం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాల్సిందే.