Munugodu Congress : మునుగోడు కాంగ్రెస్ లో కట్టప్పలు..?
Munugodu Congress : మునుగోడు కాంగ్రెస్ లో కట్టప్పలు..?
మర్రిగూడ, మన సాక్షి:
మునుగోడు కాంగ్రెస్ కు కట్టప్పల భయం పట్టుకుంది? మునుగోడులో కాంగ్రెస్ కకావికలంతల పట్టుకుంటున్న రాజగోపాల్ రెడ్డి! కాంగ్రెస్‌లోని కీలకమైన నాయకులు రాజగోపాల్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
చలమల కృష్ణారెడ్డి టిక్కెట్ ఆశించిన వ్యక్తి టికెట్ నిరాకరించడంతో ఆయన బిజెపి పార్టీలో చేరారు. అయితే ఇక్కడే రాజగోపాల్ రెడ్డికి తలనొప్పి స్టార్ట్అయింది. కాంగ్రెస్ లో మూడు గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుతం. పాల్వాయి స్రవంతి వర్గం రాజగోపాల్ రెడ్డి గెలుపుకు సహకరిస్తుందా..? లేక ఓటమికి ప్రయత్నిస్తుందా? చలమల వర్గం కాంగ్రెస్ లోనే ఉంటదా? వెంట వెళ్తారా? లేక కాంగ్రెస్ లోనే ఉంటూ రాజగోపాల్ రెడ్డిఓటమికి సహకరిస్తారా?
కాంగ్రెస్ వాదులు 2018లో రాజగోపాల్ రెడ్డి ని గెలిపిస్తే కాంగ్రెస్ ను కాదని 2022లో బిజెపి పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని నీచాతి నీచంగా మాటలు తిట్టాడు. మళ్లీ ఇప్పుడు గెలిపిస్తే ఉంటాడని గ్యారెంటీ లేదు అంటున్నారు. అందుకే వాళ్లు సహాయ నిరాకరణ చేస్తారా? కాంగ్రెస్ నుండి బిజెపిలో పార్టీలో ఉప ఎన్నికల్లో చేరిన నాయకులకు చాలావరకు డబ్బులు ఆశ చూపి ఇవ్వలేదని.
ALSO READ : కమ్యూనిస్టులతో కటీఫ్.. ఇక మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!
ఉప ఎన్నికల్లో ఒక్కో నాయకుడు 10 లక్షల వరకు ఖర్చు చేశారని కూడా తమకు కూడా ఇవ్వలేదని? అవి ఇస్తేనే వస్తామని మొండికేస్తున్న నాయకులు? ఇలా రాజగోపాల్ రెడ్డి పై ఏదో విధంగా బాధింపబడ్డ నాయకులే ఎక్కువగా ఉన్నారు.
ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరిన సందర్భంగా తన వెంట వచ్చిన వారికి అందరికీ మండల అధ్యక్షులు పదవులు ఇచ్చారు. అయితే పాల్వాయి స్రవంతి అన్ని మండలాలు మండల అధ్యక్షులను నియమించారు. వీటిని సవాల్ చేస్తూ మునుగోడు కాంగ్రెస్ ఇంచార్జ్ చలమల కృష్ణారెడ్డి వీటిని తిరస్కరిస్తూ ఆయన మళ్లీ కొత్త కమిటీలను చేశారు.
అయితే రాజగోపాల్ రెడ్డి వెంబడి మళ్లీ కాంగ్రెస్ కు వచ్చిన ఆ నాయకులకు ఇస్తారా? లేక స్రవంతి నియమించిన వారికే ఆ పదవులు ఉంటాయా? లేక చలమల కృష్ణారెడ్డి నియమించిన వాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉంటే వారికి ఇస్తారా? ఎవరికీ ఇచ్చిన పార్టీ లో అసమ్మతి భగ్గుమంటుంది. అలా అని ఇప్పుడున్న రెండు కమిటీలను రాజగోపాల్ రెడ్డి వీరిని నమ్మే ప్రసక్తే లేదు.
ALSO READ : Scam in PACS : పిఎసిఎస్ లో కుంభకోణం.. రైతుకు తెలియకుండా సిబ్బంది రుణాలు..!
ఇప్పుడు పార్టీలో ఏ నాయకులకు ప్రాధాన్యత ఉంటుంది? నాయకుల మధ్య వర్గ పోరు తారస్థాయిలో ఉంది. నివురు గప్పిన నిప్పులా ఎప్పుడు బగ్గుమంటుందో తెలియకుండా ఉంది. ఈ అసమ్మతి వర్గం అందరూ ఎవరు వెన్నుపోటు పొడుస్తారు? తీవ్ర డైలమాలో రాజగోపాలం గెలిపిస్తారా లేక కోపంతో ఓడిస్తారా? చలమలకు టికెట్టు రాకున్నా రాజగోపాల్ రెడ్డి ఓటమికి ఎంత ఖర్చైనా పెడతానని. తన వర్గం కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజగోపాల్ రెడ్డి వెన్నుపోటు పొడిచాలని ప్రోత్సహిస్తున్నాడని అలజడి.
రాజగోపాల్ రెడ్డి ని చావు దెబ్బ కొట్టడానికి చూస్తున్న కాంగ్రెస్ నాయకులు ఎవరు? స్రవంతి వర్గాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న చలమల వర్గాన్ని అసలు రాజగోపాల్ రెడ్డి నమ్ముతారా? ఇక్కడే చిక్కులు మొదలు రాజగోపాల్ రెడ్డి ఇచ్చే చెక్కులపై తమకు నమ్మకం లేదని నెట్ కాష్ ఇస్తేనే పనిచేస్తామంటున్న నాయకులు ఎవరు? రాజగోపాల్ రెడ్డికి తీవ్ర భయం పట్టుకుంది.
ALSO READ : కాంగ్రెస్ కి జై కొట్టిన వైఎస్ షర్మిల.!
సొంత పార్టీ వాళ్లే తమకు వెన్నుపోటు పొడుస్తారని రాజగోపాల్ రెడ్డి కి భయం పట్టుకుంది. డబ్బులు ఎంత ఖర్చు చేసినా ఓడిస్తారనే భావన కాంగ్రెస్ పార్టీలో కలుగుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు?









