సూర్యాపేట : నీళ్ల తగాదాలో వ్యక్తి దారుణ హత్య

సూర్యాపేట : నీళ్ల తగాదాలో వ్యక్తి దారుణ హత్య

సూర్యాపేట రూరల్, మనసాక్షి :

నీళ్ల తగాదాలో గొడ్డలితో వ్యక్తిపై దాడి చేసి హతమార్చిన ఘటన మండల పరిధిలోని బాలెంల గ్రామంలో ఈ నెల 16న రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పుల లింగయ్య (30) వృత్తి రీత్యా వ్యవసాయం చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి కెనాల్ నీళ్ల విషయంలో మృతుడి పెదనాన్న కుమారుడుతో  గొడవ జరిగింది.

లింగయ్యను పొలానికి నీళ్లు పెట్టనివ్వకుండా చంపాలని ఉద్దేశంతో దాడి చేశాడు. తమ్ముడు విష్ణు, చుట్టుపక్కల రైతులు కలిసి అంబులెన్స్ లో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మెరుగైన చికిత్స కోసం మంగళవారం హైదరాబాద్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలోని చౌటుప్పల్ చేరుకోగానే మృతి చెందాడు. మృతుడి తమ్ముడు విష్ణు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై సాయిరాం కేసు నమోదు చేయగా రూరల్ సీఐ శ్రీనారాయణ సింగ్ దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.