Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Musi : ఖరీఫ్ కు మూసి ప్రాజెక్ట్ నీటి విడుదలకు షెడ్యూల్ ఖరారు..!

ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సాగునీరు అందించేందుకు మూసీ ప్రాజెక్టు అధికారులు నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించారు. గురువారం జూలై 16 నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Musi : ఖరీఫ్ కు మూసి ప్రాజెక్ట్ నీటి విడుదలకు షెడ్యూల్ ఖరారు..!

సూర్యాపేట, మనసాక్షి :

ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సాగునీరు అందించేందుకు మూసీ ప్రాజెక్టు అధికారులు నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించారు. గురువారం జూలై 16 నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మూడు దశల్లో నీటిని విడుదల చేయనున్నట్లు, ప్రాజెక్టులో నీటి నిల్వలను బట్టి అవసరమైతే నాలుగో తడిని కూడా అందిస్తామని ఈ ఈ బానోత్ యాదగిరి తెలిపారు.

మొదటి దశలో జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు 20 రోజుల పాటు కాలువల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం 15 రోజుల విరామం ఇచ్చి, రెండో దశలో ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 4 వరకు మరో 15 రోజుల పాటు నీటిని సరఫరా చేస్తారు. ఇక‌ మూడో దశలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు 15 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. మొత్తం మూడు దశల్లో రైతులకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు.

2.819 టీఎంసీల నీటి వినియోగం :

ప్రస్తుతం ప్రాజెక్టులో 640.92 అడుగుల నీటిమట్టం వద్ద 3.098 టీఎంసీల నికర నీరు అందుబాటులో ఉంది. మూడు దశల్లో మొత్తం 2.819 టీఎంసీల నీటిని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం సుమారు 0.279 టీఎంసీల నికర నీరు మిగిలే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టులోకి వచ్చే వరద నీటి లభ్యతను బట్టి నాలుగో తడి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు వివరించారు.

మరిన్ని వార్తలు