సూర్యాపేట: ఎం వి డి ప్రసాద్ గురుస్వామి కన్నుమూత

ఎం వి డి ప్రసాద్ గురుస్వామి కన్నుమూత

సూర్యాపేట, మనసాక్షి : అయ్యప్ప మలదారణ స్వాములకు గురు స్వామిగా సూపరిచితులైన ఎంవిడి ప్రసాద్ గురు స్వామి అనారోగ్య కారణాలతో శుక్రవారం ఉదయం మరణించారు. గత పది రోజుల నుండి హైదరాబాదులోని కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స తీసుకొని బుధవారం ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. సూర్యాపేట పట్టణంలో ఎంవిడి ప్రసాద్ స్వామి అయ్యప్ప మాల ధారణ స్వాములకు సుపరిచితమే శబరి నగర్ లోని అయ్యప్ప దేవాలయంలో మొదటగా ఆయన స్వాములకు సేవలు అందించారు.

ఆ తర్వాత కృష్ణానగర్ కాలనీలో సొంతంగా సిద్ధి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి భక్తులకు పలు సేవలు అందించారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తోపాటు వివిధ దేవుళ్లకు అభిషేకాలు కళ్యాణాలు , ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. ఆయన మరణం అయ్యప్ప స్వామి భక్తులకు ,ఆధ్యాత్మిక వాదులకు తీరనిలోటని పలువురు భక్తులు పేర్కొన్నారు. ఎం విడి ప్రసాద్ గురుస్వామి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ కు జిల్లా అధ్యక్షులు గా పనిచేస్తున్నారు. ఆయన మరణం పట్ల సూర్యాపేట జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం సభ్యులు నివాళ్లు అర్పించారు.