Breaking Newsతెలంగాణరాజకీయంసినిమా

కొండా సురేఖ పై కోర్టును ఆశ్రయించిన నాగార్జున..!

కొండా సురేఖ పై కోర్టును ఆశ్రయించిన నాగార్జున..!

మనసాక్షి, వెబ్ డెస్క్:

తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొండ సురేఖ పై సినీ హీరో అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండ సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబాన్ని నాగచైతన్య, సమంత వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపాయి. ఈ విషయంపై సినీ ప్రముఖులంతా కొండ సురేఖ పై మండిపడ్డారు. చివరికి ఆమె తగ్గి సమతకు క్షమాపణ కూడా చెప్పారు.

కానీ కొండ సురేఖ తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు.  ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు.

 

 

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు