నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల..!
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సోమవారం మరోసారి నీటిని విడుదల చేశారు. పంటలు ఎండిపోతున్నాయని రైతుల విజ్ఞప్తి మేరకు ఇటీవల కొద్ది రోజులపాటు నీటిని విడుదల చేసిన అధికార యంత్రాంగం మరోసారి విడుదల చేసింది.

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సోమవారం మరోసారి నీటిని విడుదల చేశారు. పంటలు ఎండిపోతున్నాయని రైతుల విజ్ఞప్తి మేరకు ఇటీవల కొద్ది రోజులపాటు నీటిని విడుదల చేసిన అధికార యంత్రాంగం మరోసారి విడుదల చేసింది.
ఎంఎల్సి కేతావత్ శంకర్ నాయక్ విజ్ఞప్తి మేరకు మాజీ మంత్రి జానా రెడ్డి , నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు నలమాద ఉత్తంకుమార్ రెడ్డి స్పందించి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డితో మాట్లాడి నీటి విడుదల కి ఆదేశాలు ఇచ్చారు.
ఎడమ కాలువ ఆయకట్టు మీద ఉన్న రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పంటలను కాపాడడం కోసం, మంచినీటి అవసరాల కోసం ఎన్ఎస్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు ఎడమ కాలు ద్వారా నీటిని విడుదల చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి,5 వ వార్డు ఇన్చార్జి కేతావత్ జవహర్ నాయక్ , ఓబీసీ సెల్ జిల్లా నాయకులు ప్రవీణ్, మిర్యాలగూడ మండల ఆత్మ చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.