NagarjunaSagar : బుద్ధవనం చేరుకున్న దమ్మయాత్ర.. ఘనంగా స్వాగతం..!
గౌతమ బుద్ధుని శాంతి సందేశంతో ప్రజలను మేల్కొల్పుతూ సాగిన మూడవ దమ్మయాత్ర ఆదివారం సాయంత్రానికి బుద్ధవనం చేరుకుంది. దమ్మయాత్ర బుద్ధవనం చేరుకున్న సందర్భముగా స్థానిక శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మానస స్వర్ణ, వైస్ చైర్మన్ రాజా ప్రసాదులతో కలిసి బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య దమ్మయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు.

NagarjunaSagar : బుద్ధవనం చేరుకున్న దమ్మయాత్ర.. ఘనంగా స్వాగతం..!
ఎమ్మెల్యే జైవీర్ తో కలిసి ఘనంగా స్వాగతం పలికిన మల్లేపల్లి లక్ష్మయ్య
నాగార్జునసాగర్, మన సాక్షి :
గౌతమ బుద్ధుని శాంతి సందేశంతో ప్రజలను మేల్కొల్పుతూ సాగిన మూడవ దమ్మయాత్ర ఆదివారం సాయంత్రానికి బుద్ధవనం చేరుకుంది. దమ్మయాత్ర బుద్ధవనం చేరుకున్న సందర్భముగా స్థానిక శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మానస స్వర్ణ, వైస్ చైర్మన్ రాజా ప్రసాదులతో కలిసి బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య దమ్మయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు.
బంజారా నృత్యాలతో, కోలాటాలతో, ఒగ్గు కళాకారుల నృత్యాలతో, స్థానికులు, బౌద్ధ అభిమానులు అధిక సంఖ్యలో దమ్మయాత్ర బృందానికి అడుగు అడుగున పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం 403 కిలోమీటర్లు పాదయాత్ర తో వచ్చిన థాయిలాండ్, భారతీయ బౌద్ధ భిక్షువులుకు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుద్ధవనములోని అశోక ధర్మ చక్రం వద్ద బౌద్ధ భిక్షువుల పాదాలను కడిగారు.
ALSO READ : Nalgonda : నల్గొండ జిల్లాలో రూ.15 లక్షల బంగారం పోగొట్టుకున్న మహిళ.. గంటల్లో రికవరీ ఎలా అయిందంటే..!
థాయిలాండ్ నుండి బౌద్ధ దమ్మయాత్ర ద్వారా తీసుకురాబడిన బుద్ధ ధాతువులను బుద్ధ వనం ప్రధాన ద్వారం నుండి స్థానిక శాసనసభ్యులు కుందూరు జై వీర్ రెడ్డి, నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మానస స్వర్ణ, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, గగన్ మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షులు గగన్ మాలిక్, సిద్ధార్థ లతో కలిసి బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య బుద్ధ ధాతువులను ఊరేగింపుగా తీసుకువచ్చి మహ స్తూపం లోని ధ్యాన మందిరంలో సందర్శకుల సందర్శనార్థం అందుబాటులో ఉంచారు.
మహ స్తూపం లోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతిలను వెలిగించిన అనంతరం ధ్యానం చేశారు. ఈ సందర్భంగా బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ సంఘ థాయిలాండ్ అధ్యక్షులు పర సంగ్ సక్ కోవిడో ప్రధాన బౌద్ధ భిక్కు ఆధ్వర్యంలో థాయిలాండ్ భిక్షువులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భిక్షులతో సుమారు 403 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి బుద్ధవనం చేరుకున్నారన్నారు.
ALSO READ ; Ration Cards : రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త..!
థాయిలాండ్ రాజకుటుంబం నుండి మహా థాయ్ ఈ దమ్మయాత్రకు సహకారం అందించారని తెలిపారు. గగన్ మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గగన్ మాలిక్ దమ్మయాత్రకు ప్రారంభం నుండి ముందుండి నడిపించారన్నారు. అక్షయ ఫౌండేషన్ అధ్యక్షులు సిద్ధార్థ హిట్టెంబరి, లతరాజా ఫౌండేషన్ అధ్యక్షులు కేకే రాజా దమ్మ యాత్ర విజయవంతం చేసేందుకు భాగస్వాములు అయ్యారని తెలిపారు.
బి ఎస్ ఐ తెలంగాణ అధ్యక్షులు పరంధాములు ఆధ్వర్యంలో బి ఎస్ ఐ సభ్యులు తెలంగాణలో కొనసాగిన దమ్మయాత్రకు సేవలు అందించారని అన్నారు. 29 రోజులు పాటు కొనసాగిన దమ్మయాత్రలో “సాతి” అనే శునకం బౌద్ధ బిక్షువులతో పాటు నడుస్తూ పాదయాత్రలో పాల్గొని ప్రత్యేకతను చాటుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ వనం ఆర్ట్స్ మరియు ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, స్థానిక సీఐ శ్రీను నాయక్, ఎస్సై ముత్తయ్య, స్థానిక కౌన్సిలర్లు, బౌద్ధాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
- Ration Cards : రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త..!
- Hyderabad : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. మదీనా బాధితులకు ప్రభుత్వం అండ..!
- Big Alert : రైతులకు బిగ్ అలర్ట్.. ఈరోజే చివరి తేదీ, అలా చేయకుంటే పథకాలు, రాయితీలు అందవు..!
- Big Alert : రైతులకు బిగ్ అలర్ట్.. ఈరోజే చివరి తేదీ, అలా చేయకుంటే పథకాలు, రాయితీలు అందవు..!










