Breaking Newsక్రైంతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోరం.. సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన కారు, ఒక మృతదేహం లభ్యం..!

నల్గొండ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. నిడమానూరు (మం) ముకుందాపురం వద్ద కారు అదుపుతప్పి సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది.

Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోరం.. సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన కారు, ఒక మృతదేహం లభ్యం..!

మన సాక్షి, నల్గొండ :

నల్గొండ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. నిడమానూరు (మం) ముకుందాపురం వద్ద కారు అదుపుతప్పి సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది. కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్, గల్లంతైన దంపతులు. భాదితులు త్రిపురారం (మం) కంపాసాగర్ కి చెందిన తల్లం పుల్లయ్య, పద్మగా గుర్తించారు. దంపతులు ఇరువురు శనివారం సాయంత్రం మిర్యాలగూడ నుంచి స్వగ్రామమైన కంప గల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నాలు.

ఆదివారం ఉదయం నుంచి డ్రైవర్ చెప్పిన ఆచూకీ మేరకు గాలిపు చర్యలు చేపడుతుండగా ఎట్టకేలకు కారును బయటకు తీయగా పద్మ మృతదేహం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇంకా మల్లయ్య మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సాగర్ ఎడమ కాలువ వద్దకు సమీప గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు. బంధువుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

మరిన్ని వార్తలు