క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండలో యువకుడి దారుణ హత్య..!
నల్గొండ జిల్లా కేంద్రంలో యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.

Nalgonda : నల్గొండలో యువకుడి దారుణ హత్య..!
మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :
నల్గొండ జిల్లా కేంద్రంలో యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పెద్ద బండ లోని సత్యనారాయణ కాలనీకి చెందిన బోతు సాయి ని దారుణంగా హత్య చేశారు. నల్లగొండ పట్టణానికి అతి సమీపంలో తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హ్యాపీ హోమ్స్ ఎదురుగా వెంచర్ల హత్యకు పాల్పడ్డారు.
యువకుడిని బండరాళ్లతో మోడీ మెదడు బయటికి వచ్చేలా దారుణంగా హత్య చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను టూ టౌన్ సిఐ రాఘవరావు, తిప్పర్తి ఎస్సై శంకర్ సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం బృందం చే వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









