క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : చెరువుగట్టు దేవస్థానంలో ఉద్యోగి నిర్వాకం.. అరెస్టు చేసిన పోలీసులు..!
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో ఉద్యోగి నిర్వాకం చేశారు. దేవస్థానంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు

Nalgonda : చెరువుగట్టు దేవస్థానంలో ఉద్యోగి నిర్వాకం.. అరెస్టు చేసిన పోలీసులు..!
మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో ఉద్యోగి నిర్వాకం చేశారు. దేవస్థానంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం దేవస్థానంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న వ్యక్తి బ్యాంకులో జమ చేయకుండా ఒక లక్ష మూడు వేల రూపాయలను తప్పుడు లెక్కలు చూపించినాడు. అయితే బ్యాంకులో జమ చేయకుండా తప్పుడు లెక్కలు చూపినట్లు విచారణలో తేలింది. కాగా ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిందితుడిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.









