Nalgonda : నల్గొండ కాంగ్రెస్ లో కోల్డ్ వార్.. చిరిగిన డిసిసి అధ్యక్షుడి ఫ్లెక్సీలు..!
నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో కోల్డ్ వార్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

Nalgonda : నల్గొండ కాంగ్రెస్ లో కోల్డ్ వార్.. చిరిగిన డిసిసి అధ్యక్షుడి ఫ్లెక్సీలు..!
మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :
నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో కోల్డ్ వార్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పున్న కైలాస్ నేత డిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లా కేంద్రంలో రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులకు.. పున్న కైలాస్ నేత అనుచరులకు వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే పున్న కైలాష్ నేతను డిసిసి అధ్యక్షుడిగా ప్రకటించిన సమయంలో తాను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కూడా మున్సిపల్ కౌన్సిలర్లకు బి ఫామ్ లు అందజేసే సమయంలో కూడా ఇరువురి మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
కాగా ఇటీవల డిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న పున్న కైలాస్ నేత జన్మదినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో అతని అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్లేక్సీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోటో మినహా జిల్లా నాయకులందరి ఫోటోలను పెట్టారు. కాగా గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో జన్మ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉన్న కైలాస్ నేత ఫ్లెక్సీలను చించిపడేశారు. దాంతో వివాదం మరింతగా ముదిరింది. ఇక ఇరువురి వివాదం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.









