Nalgonda : అర్ధరాత్రి నల్గొండ జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ..!
Nalgonda : అర్ధరాత్రి నల్గొండ జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ..!
కొండమల్లెపల్లి, మన సాక్షి :
పాత నేరస్తుల కదిలికలపై నిరంతరం నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. బుధవారం అర్ధరాత్రి కొండమల్లెపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు.
సీసీటీవీల ఏర్పాటు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పరిసరాలు, స్థితిగతుల పై ఆరా తీశారు. రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు.సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగం పై ప్రజలకు ఆహ్వాన కల్పించాలని సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం, అక్రమ ఇసుక, పి.డి.యస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సాధించి, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
MOST READ :
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!
-
District Additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ సుడిగాలి పర్యటన..!
-
Vi : కస్టమర్లకు ‘వీఐ’ శుభవార్త: రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజుల అదనపు వ్యాలిడిటీ..!
-
Pasha Mailaram : పాశ మైలారం ఘటనలో 36కు చేరిన మృతుల సంఖ్య.. మృతులకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!
-
Gold Price : వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా రూ.11400.. ఈరోజు ధర ఎంతంటే..!









