జిల్లా వార్తలుBreaking Newsనల్గొండవిద్య

Nalgonda : పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు..!

ఈనెల 25 నుండి మార్చి 13 వరకు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి దస్రు నాయక్ తెలిపారు.

Nalgonda : పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు..!

నల్లగొండ, మన సాక్షి.

ఈనెల 25 నుండి మార్చి 13 వరకు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి దస్రు నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ జిల్లాలో ఫస్ట్ ఇయర్ జనరల్ 11807 విద్యార్థులు ఒకేషనల్ 2117 మంది విద్యార్థులు. సెకండ్ ఇయర్ జనరల్ 11733 మంది విద్యార్థులు ఒకేషనల్ 2248 మంది విద్యార్థులు, పరీక్షలకు హాజరు కాలినట్లు తెలిపారు.

పరీక్షలు ఉదయం 9 నుండి 12 గంటల వరకు నిర్వహిస్తామని జిల్లాలో 48 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని పరీక్షలు జరిగే ప్రాంతాలలో 144 సెక్షన్ తో పాటు జిరాక్స్ సెంటర్లు మూసివేస్తామన్నారు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి ఇద్దరు ఫ్లైయింగ్ స్కాడు, ముగ్గురు సిట్టింగ్స్ కార్డ్స్ తో పాటు సీసీ కెమెరాలు ప్రతి సెంటర్లో ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కోరారు.

MOST READ : 

  1. Nalgonda : నల్గొండ జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..!
  2. Nalgonda : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి.. రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడలు ప్రారంభం..!
  3. Farmer Registration : రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ముగియనున్న గడువు..!
  4. Nalgonda : మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు.. జూనియర్ కళాశాల వార్షికోత్సవం లోనే ఆర్డర్స్..!

మరిన్ని వార్తలు