Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. జీవిత ఖైదు, జరిమానా:.!

నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 12, 2012లో, జరిగిన హత్య కేసులో నిందితుడు రామాపురం మల్లేశ్వర్ రావుకు జిల్లా అదనపు న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మృతుడు రామావత్ బాల (35), నల్లగొండ పట్టణంలోని తులసి నగర్ ప్రాంతానికి చెందినవాడు.

Nalgonda : హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. జీవిత ఖైదు, జరిమానా:.!

నల్లగొండ, మనసాక్షి:

నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 12, 2018లో, జరిగిన హత్య కేసులో నిందితుడు రామాపురం మల్లేశ్వర్ రావుకు జిల్లా అదనపు న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మృతుడు రామావత్ బాల (35), నల్లగొండ పట్టణంలోని తులసి నగర్ ప్రాంతానికి చెందినవాడు.

మృతుని సోదరితో నిందితుడు అక్రమ సంబంధం ఉండగా మృతుడు అడ్డుగా వస్తున్నాడన్నా నేపథ్యంలో పథకం ప్రకారం తేది డిసెంబర్ 12, 2018 న ఉదయం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో హత్యచేయడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో మృతుడి సోదరి నిందితుడు రామాపురం మల్లేశ్వర్ పై ఫిర్యాదు మేరకు నల్లగొండ II టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా..

సంఘటన స్థలంలో రక్తంతో తడిసిన బండరాయి, లుంగీ, ఇతర దుస్తులు మరియు రక్తపు నమూనాలను స్వాధీనం చేసుకుని పూర్వనిక్స్ ల్యాబ్ కు పంపించగా ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో డీఎన్‌ఏ విశ్లేషణ ద్వారా సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న వస్త్రాలపై నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న చొక్కాపై లభించిన రక్తపు మరకలు ఒకే జీవసంబంధ మూలానికి చెందినవని నిర్ధారణ అయిందని ఎస్పీ వివరించారు.

అదేవిధంగా 164 క్రైమ్ ప్రకారం కీలక సాక్షుల వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేయబడినట్లు తెలిపారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలు మరియు వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం కోర్టు నిందితుడిపై నేరాన్ని నిర్ధారించి,నిందితునికి ఐపిసి సెక్షన్ 302 కింద జీవిత ఖైదు మరియు రూ.10,000 జరిమానా, ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్ 3(2) వికింద మరో జీవిత ఖైదు రూ.10,000 జరిమానా, ఐపిసి సెక్షన్ 201 కింద 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించబడిందన్నారు.

మొత్తం రూ.30,000 జరిమానా విధించగా, అన్ని శిక్షలు సమాంతరంగా అమలులో ఉంటాయని కోర్టు స్పష్టం చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును శాస్త్రీయంగా, సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేసిన అప్పటి దర్యాప్తు అధికారులు, డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, సీఐ మహబూబ్ బాషా,ఎస్.ఐ నరసింహులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్ అఖిల, ప్రస్తుత అధికారులు డిఎస్పి శివరాం రెడ్డి, సిఐ రాఘవరావు, ఎస్ఐ సైదులు, సిడిఓ సుమన్, కోర్ట్ లైసెనింగ్ ఆఫీసర్స్ నరేందర్ మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు