TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేయర్, మున్సిపల్ చైర్మన్లు ఖరారు.. ఎవరెవరు ఎక్కడ..!

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపల్ మున్సిపాలిటీలు ఉండగా తిరుమలగిరి మున్సిపాలిటీ మినహా మిగతా మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేయర్, మున్సిపల్ చైర్మన్లు ఖరారు.. ఎవరెవరు ఎక్కడ..!

మన సాక్షి, నల్గొండబ్యూరో :

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపల్ మున్సిపాలిటీలు ఉండగా తిరుమలగిరి మున్సిపాలిటీ మినహా మిగతా మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాగా సోమవారం (ఫిబ్రవరి 16న) మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లతో పాటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు.

ఈ ప్రక్రియ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నల్గొండ మేయర్ తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ల ఎంపిక కూడా ఖరారైంది. వారి ఎన్నిక లాంఛనం కానున్నది. సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. డిప్యూటీ మేజర్ విషయంలో కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా నల్గొండ జిల్లాలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గా పున్న శైలజ వెంకటేశ్వర్లు, హాలియా మున్సిపల్ చైర్మన్ గా చింతల చంద్రారెడ్డి, నందికొండ చైర్మన్ గా మానస స్వర్ణ, చండూర్ మున్సిపల్ చైర్మన్ గా కోడి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా భూతరాజు దశరథ, చిట్యాల చైర్మన్ గా పందిరి గీత ఎంపికయ్యారు.

సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా మొరిశెట్టి నివేదిత, హుజూర్‌నగర్ మున్సిపల్ చైర్మన్ గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ గా కొనతం చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ గా నూకల సందీప్ రెడ్డి, కోదాడ మున్సిపల్ చైర్మన్ గా ఎర్నేని కుసుమ బాబు, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ గా సంకేనపల్లి రఘునందన్ రెడ్డిలు ఖరారయ్యారు. వీరు సోమవారం ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

భువనగిరి జిల్లాలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బీజన బాలమణి భాస్కర్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గా గుండ్లపల్లి వాణి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ గా పావని రమేష్ గౌడ్, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ గా తడక వెంకటేశం, మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా గడ్డం స్వప్న ఖరారయ్యారు.

ఇదిలా ఉండగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దాంతోపాటు భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

MOST READ 

  1. Minister Komatireddy : శివ నామ స్మరణలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..!

  2. CM Revanth Reddy : కవితకు షాక్.. సీఎం ను కలిసిన ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్లు.. (వీడియో)

  3. TG News : మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లోకి కొత్తగూడెం స్వతంత్ర కార్పొరేటర్లు..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా ఎకరానికి రూ.6000.. కొందరికేనా.. అందరికా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు