Nalgonda : మహిళలు స్వయం శక్తితో ఎదగాలి.. మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
మహిళలు స్వయం శక్తితో పైకి ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.

Nalgonda : మహిళలు స్వయం శక్తితో ఎదగాలి.. మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
నల్లగొండ, మనసాక్షి:
మహిళలు స్వయం శక్తితో పైకి ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సోమవారం అయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయావరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 11.38 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు చెక్కులను అందజేశారు.
అంతేకాక ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పటివరకు 265 కోట్ల మంది ఉచిత బస్సులో ప్రయాణం చేసినట్లు చెప్పారు. సమాజంలో పేద వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, సన్న బియ్యం ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని తెలిపారు.
నల్గొండ సమీపంలోని ఎస్ఎల్బీసీ వద్ద 5 కోట్ల రూపాయలతో రెండు ఎకరాల విస్తీర్ణంలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేశామని, రెండు నెలల్లో ఇది పూర్తవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో మహిళలతో పెట్రోల్ పంపు ఏర్పాటు చేస్తుండగా, ప్రభుత్వమే స్థలం ,రుణాలు మంజూరు చేసి రైస్ మిల్లులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
వచ్చే సంవత్సరంలోపు ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇన్ఫలు ఇస్తామని, ఇంకా ఎవరైనా స్థలం కలిగి ఉంటే తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. పిల్లలను బాగా చదివించుకోవాలని,చిన్న వయసులో పెళ్లిళ్లు చేయవద్దని, ఎవరైనా ఆర్థిక స్తోమత లేక పెద్ద పెద్ద చదువులు చదివించలేకపోతే తనను సంప్రదిస్తే సహకారం అందిస్తానని తెలిపారు.
ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా బొట్టుగూడా పాఠశాలను 13 కోట్ల రూపాయలతో ప్రైవేట్ పాఠశాలలకు మించి అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నామని, త్వరలోనే ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఐటిపాములలో 50 లక్షల రూపాయలు వెచ్చించి 50 మంది మహిళలకు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేయించామని, దాని ద్వారా వారు ఆదాయం పొందుతున్నారని తెలిపారు.
మహిళలును కోటీశ్వరులను చేసే వరకు వారి వెంటే ఉంటామని మంత్రి వెల్లడించారు.జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు తోపాటు ,వారి అభ్యున్నతికి కుటుంబాల తోడ్పాటుకు అనేక కార్యక్రమాల అమలు చేస్తున్నదని తెలిపారు. ఆర్థికంగా వారు నిలదొక్కునేందుకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నదని, ఇది మంచి అవకాశం అని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
2023- 2024 -25 ఆర్థిక సంవత్సరంలో 2872 స్వయం సహాయక సంఘాల మహిళలకు 11.38 కోట్ల రూపాయలు చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నల్గొండ పట్టణంలో సుమారు 5 కోట్ల రూపాయలను స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెల్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నాలుగు మున్సిపాలిటీలలో ఇందిరమ్మ చీరల పంపిణీ సైతం చేపట్టడం జరిగిందని, సోమ, మంగళవారం వరకు వీటిని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
అలాగే స్వయం సహాయక మహిళా సంఘాలకు లక్ష్యాన్ని మించి 165 శాతం బ్యాంక్ రుణాలు అందించడం జరిగిందని ఆయన వెల్లడించారు. స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి మాట్లాడారు. కాగా పట్టణ స్థాయి స్లం ఫెడరేషన్ అధ్యక్షురాలు జయమ్మ, లావణ్యలు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ,మెప్మా పీడీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్ ,మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ NEWS :
-
Gold Price : బంగారం ఇక కొనలేమా.. ఒక్కరోజులో రూ.22,500.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై కీలక పరిణామం.. స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు..!
-
BIG BREAKING : ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తుండగా కారు ప్రమాదం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!
-
Nalgonda : విదేశాలకు పంపడం, ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం.. ఎక్కడో, ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
-
Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!
-
Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా పై కీలక అప్డేట్..!











