నందికొండలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం..!
నందికొండలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం..!
హాజరైన 9మంది సభ్యులు
కొత్త చైర్పర్సన్ ఎంపికపై ఉత్కంఠ
పోలీస్ బందోబస్తు మధ్య అవిశ్వాస తీర్మానం
తీర్మానం నెగ్గడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు
నాగార్జున సాగర్, మన సాక్షి :
నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ చీలిక వర్గం, కాంగ్రెస్ కౌన్సిలర్లు మొత్తం 9 మంది ఓటేశారు. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ కర్ణ అనూష శరత్ రెడ్డి,వైస్ చైర్మన్ మంద రఘువీర్(బిన్నీ) పదవిని కోల్పోయారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన ఆర్డీవో చెన్నయ్య ఆధ్వర్యంలో 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ ప్రతిపాదించగా మిగతా ఎనిమిది మంది సభ్యులు ఆమోదించారు.
మున్సిపాలిటీలోని 11 మంది సభ్యులు ఉండగా 9 మంది సబ్యుకు ఏకతాటిపై ఉండడంతో చైర్‌పర్సన్‌కు పదవీ గండం తప్పలేదు. మున్సిపల్ పీఠం కోల్పోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశ అలుముకున్నది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రె్‌సకు చెందినవారే తదుపరి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కు చెందిన కుందూరు జయవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ALSO READ : BREAKING : ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా.. వైఎస్ షర్మిలా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
హాజరైన 9మంది మంది కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా నోటీసులు అందజేసిన 9మంది సభ్యులు గురువారం నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.కౌన్సిలర్లు ఈర్ల రామకృష్ణ,తిరుమలకొండ మోహన్ రావు,మంగత నాయక్, రమేష్ జి, రమావత్ శిరీష మోహన్ నాయక్, ఆదాసు నాగ రాణి విక్రమ్, నిమ్మల ఇందిరా, అన్నపూర్ణ, నంద్యాల శ్వేతా రెడ్డి ఉదయం 10:30కు కౌన్సిల్ సమావేశ మందిరానికి చేరుకున్నారు.
కోరంకు సరిపడా హాజరు ఉండడంతో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఆర్డీవో మేరకు ఫొటో, వీడియో చిత్రీకరణ ద్వారా 9 మంది కౌన్సిలర్ల సంతకాలు సేకరించారు. అనంతరం చైర్పర్సన్ కర్ణ అనూష శరత్ రెడ్డి పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఓటింగ్ నిర్వహించారు.
అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మొత్తం 9కి 9 మంది మంది కౌన్సిలర్లు చేతులు పైకెత్తడంతో, అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ధ్రువీకరించారు. కొత్త చైర్పర్సన్ ఎన్నికకు తేదీ ప్రకటిస్తామని తెలిపారు.
ALSO READ : BREAKING : రోడ్డు ప్రమాదం.. లారీ, పెండ్లి బస్సు ఢీ..!









