తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లావ్యవసాయం

Rythu : నానో యూరియా ఏలా వినియోగించాలి.. రైతులకు అవగాహణ..!

Rythu : నానో యూరియా ఏలా వినియోగించాలి.. రైతులకు అవగాహణ..!

మందమర్రి రూరల్, మన సాక్షి :

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గుడిపల్లి గ్రామ రైతులకు మందమర్రి వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి సోమవారం నానో యూరియా వినియోగం మరియు దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నానో యూరియా సాధారణ యూరియా బస్తాతో పోల్చినట్లయితే తక్కువ పరిమాణం కలిగి అంతే స్థాయిలో పోషకాలను అందిస్తుందని అన్నారు.

అదేవిధంగా తక్కువ ధరలో ఎక్కువ పోషకాల లభ్యతతో పొలానికి అందించడానికి సులువుగా ఉంటుందనిఅన్నారు.నానో యూరియా ద్రవ రూపంలో ఉండి పైపాటుగా పంటపై పిచికారి చేయుట ద్వారా తక్కువ ఖర్చుతో పాటు సమయం ఆదా అవుతుందని అంతేగాక పర్యావరణ హితంగా ఉండి భూమి మరియు భూగర్భ జల కాలుష్యం తగ్గుతుందని తెలిపారు.

రాబోవు రోజుల్లో కలిగే యూరియా కొరతను అధిగమించడానికి నానో యూరియా ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ యూరియా నిదానంగా మొక్కకు అందుతూ మొక్క శాఖీయ ఎదుగుదలకు తోడ్పడి తద్వారా అధిక వినియోగానికి మరియు అధిక దిగుబడులకు తోడ్పాటు అందిస్తుందని తెలియజేశారు.

కావున రైతు సోదరులందరూ నానో యూరియా వినియోగానికై మొగ్గు చూపాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గుడిపల్లిగ్రామ రైతులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!

  2. New Scheme : మహిళలకు తీపి కబురు.. వారికోసం మరో కొత్త పథకం..!

  3. Farmer : ఆ ప్రభుత్వ పథకాలకు.. ప్రతి రైతుకు ఇది తప్పనిసరి.. బిగ్ అలర్ట్..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భారీ శుభవార్త.. వారికి రూ.10 లక్షలు..!

మరిన్ని వార్తలు