Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్

New Scheme : మహిళలకు తీపి కబురు.. వారికోసం మరో కొత్త పథకం..!

New Scheme : మహిళలకు తీపి కబురు.. వారికోసం మరో కొత్త పథకం..!

మనసాక్షి వెబ్ డెస్క్ :

డ్వాక్రా మహిళలకు ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతోంది. డ్వాక్రా మహిళల పిల్లలు చదువుకు భరోసా కల్పించేందుకు గాను సంచలన నిర్ణయం తీసుకొని కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు సమాచారం.

పిల్లలను చదివించడానికి డబ్బులు లేక వడ్డీలకు తీసుకొచ్చి అప్పులు చేస్తున్న తల్లిదండ్రుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురానున్నది. చిన్నారుల చదువులకు ప్రభుత్వం అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్ విద్యాసంకల్పం అనే నూతన పథకాన్ని తీసుకురానున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.

డ్వాక్రా మహిళా సంఘాలకు శ్రీనిధి బ్యాంకు ద్వారా లక్ష రూపాయల వరకు నాలుగు శాతం వడ్డీకే (35 పైసలు) రుణాలను అందించనున్నది. ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల తల్లులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

తీసుకున్న మొత్తం గరిష్టంగా 36 నెలల వరకు చెల్లించే అవకాశం ఉంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కూటమి ప్రభుత్వం త్వరలో తెలియజేయునది.

MOST READ : 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భారీ శుభవార్త.. వారికి రూ.10 లక్షలు..!

  2. Gold Price : ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!

  3. Rythu : తెలంగాణలో రైతులకు అదిరిపోయే మరో కొత్త పథకం.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Farmers : రైతులకు భారీ గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరలకు చర్యలు.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు