Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking News

Rythu : తెలంగాణలో రైతులకు అదిరిపోయే మరో కొత్త పథకం.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu : తెలంగాణలో రైతులకు అదిరిపోయే మరో కొత్త పథకం.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ చేసింది. దాంతో పాటు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. అదేవిధంగా రైతు కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా తీసుకొచ్చింది. దాంతోపాటు రైతులు పంటలు విక్రయించుకుంటే సన్న ధాన్యం పండించిన రైతులకు 500 రూపాయలను క్వింటాకు బోనస్ గా అందజేస్తుంది.

అయినా కూడా పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో మైలేజీ రాలేదు. అనేక చోట్ల రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రైతుల సంక్షేమం కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకుగాను సంబంధిత అధికారులతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ కొత్త పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా పాడి గేదెల పంపిణీ పథకాన్ని తీసుకురానున్నది. ఒక్కొక్క గేదెకు లక్ష రూపాయల చొప్పున ఒక్కో రైతుకు రెండు గేదెలు అందజేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా పాడి గేదెలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష మంది రైతులకు మొదటి విడతగా పాడి గేదెలను పంపిణీ చేయాలని, ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో పాటు పార్టీకి కూడా మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు.

ఈ పథకం ప్రారంభించిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అధికారులు గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. కౌలు రైతులను కూడా ఈ పథకంలో బాగం చేయాలనే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి. వారితో పాటు వ్యవసాయ భూమి లేని రైతు కూలీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా, రైతు బీమా పై కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  3. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. లంచం అడిగిన డాక్టర్ సస్పెండ్..!

  4. Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

  5. District collector : జిల్లా కలెక్టర్ సీరియస్.. కేసులు నమోదైన మిల్లర్లపై చర్యలు..!

మరిన్ని వార్తలు