తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : పేటలో బంద్ సంపూర్ణం.. తెరుచుకోని దుకాణాలు, మూతపడిన విద్యా సంస్థలు..!

Narayanpet : పేటలో బంద్ సంపూర్ణం.. తెరుచుకోని దుకాణాలు, మూతపడిన విద్యా సంస్థలు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు,మారణకాండ ను నిరసిస్తూ మంగళవారం హిందూ సంఘాలు నిర్వహించిన బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. బంద్ సందర్భంగా పట్టణంలో వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, బ్యాంకులు తెరుచుకోలేదు.

ఈ పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ రణ గర్జన నిర్వహించారు. పట్టణంలోని సుభాష్ రోడ్డు చౌరస్తా నుండి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వందలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో బాంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులపై జరుగుతున్న మారణకాండను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.

ఈ ర్యాలీలో పార్టీలకతీతంగా నారాయణపేట యువకులు కదం తొక్కి, హిందుత్వ నినాదాలతో పేటలో మారుమోగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు బాంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దారుణ మారణ కాండను ఆపడానికై తక్షణ కర్తవ్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాంగ్లాదేశ్ లో జరుగుతున్నది రేపు మన దేశంలోని కేరళ తమిళనాడు, పక్షిమ బెంగాల్ తదితర ఈశాన్య రాష్ట్రాలలో కూడా జరుగుతా యాని,తెలుగు రాష్ట్రా లలో బాంగ్లాదేశ్ దుస్థితులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా హిందుత్వ, జాతీయ వాదశక్తులు జాగృతం కావాలని పిలుపునిచ్చారు.

అలాంటి పరిస్థితులు వస్తే రాజకీయ పార్టీలన్నీ కూడా తమ తమ స్వార్థాలని వీడి హిందూత్వ రక్షణకై ఐక్యం కావాలని అన్నారు.బంద్ కు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్,భజరంగ్ దళ్ ఏబీవీపీ, హిందూ వాహిని, బీజేవైఎం, బీకేఎస్, వివిధ రాజకీయ పక్షాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

Good News : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. సేల్స్ ఎంపోరియం ఏర్పాటు..!

Miryalaguda : సాగర్ కాలువలు ఇలా.. నీరు పారేది ఎలా..!

పోలిస్టేషన్ ముందే కారు అద్దాలు పగలగొట్టి చోరీ..!

District collector : ప్రజావాణితో సమస్యలకు చెక్.. జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు