Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమెదక్

Accident : నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం.. మహిళ మృతి, గ్రామస్తుల ఆందోళన..!

Accident : నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం.. మహిళ మృతి, గ్రామస్తుల ఆందోళన..!

టేక్మాల్, మన సాక్షి ప్రతినిధి:

మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బోడ్మట్ పల్లి 161 జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి చెందింది.

మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బోడ్మట్ పల్లి గ్రామానికి చెందిన భవాని సత్యమ్మ (38) వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. నేషనల్ హైవే అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి తిరిగి వచ్చేందుకు గాను నేషనల్ హైవే పై లైట్లు నిర్మించకపోవడం వల్ల పూర్తిగా అంధకారంలో ఉండి కనిపించక ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేషనల్ హైవే పై గ్రామస్తులందరూ బైఠాయించారు.

టేక్మాల్ ఎస్సై రాజేష్ మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి మీ సమస్యకు పరిష్కారం చూపెడతానని హామీ ఇచ్చిన వినకుండా రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో నేషనల్ హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గ్రామస్తుల సమస్యకు పరిష్కారం చూపెడతామని టేక్మల్ ఎస్సై గ్రామస్తులకు చెప్పి ఆందోళనను విరమింప చేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు