తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా

Suryapet : ఆయిల్ ఫామ్ సాగుతో నికర ఆదాయం.. త్వరలో ఉమ్మడి జిల్లాలో కంపెనీ ఏర్పాటు..!

Suryapet : ఆయిల్ ఫామ్ సాగుతో నికర ఆదాయం.. త్వరలో ఉమ్మడి జిల్లాలో కంపెనీ ఏర్పాటు..!

తిరుమలగిరి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లాలో ని ఆయిల్ ఫామ్ తోటల సాగుకు అనువైన భూములు ఉన్నాయని నీటి వసతి ఉన్న రైతులు సాగు చేసి నికర ఆదాయం పొందాలనీ పతంజలి ఆయిల్ పామ్ తెలంగాణ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి యాదగిరి అన్నారు. తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామం లోఆయిల్ పామ్ తోటల సాగు చేస్తున్న ఎదుదొడ్ల మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తోటలను సందర్శించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అందించే రాయుతిలను సద్వినియోగం చేసుకొని ఆయిల్ ఫామ్ తోటలను సాగుచేసి అధిక ఆదాయం పొందాలని కోరారు. ఈ పంటకు కూలీ ఖర్చులు తక్కువ,కోతుల, బెడదలేద అన్నారు.

ఆయిల్ ఫామ్ పంటను ప్రభుత్వం నిర్ణయుంచిన ధరకు ప్రభుత్వం నియమించిన కంపెనీ వారే విక్రయస్తారని మధ్య దళారుల బెండద ఉండదని అన్నారు. జిల్లాలోని భూములు ఆయిల్ పామ్ తోటల సాగుకు చాలా అనువైన భూములని చెప్పారు.

త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పతంజలి ఆయిల్ ఫామ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారని రైతులు ఎలాంటి అపోహలకు పోకుండా ఆయిల్ పామ్ తోటలు సాగుచేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో పతంజలి ఆయిల్ ఫామ్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ అశోక్,క్షేత్ర సహాయకులు రంగు ముత్యంరాజు, నాగరాజు రైతులు ఏడుదొడ్ల వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తో పాటు పలువురు రైతులు పాలుగోన్నారు.

LATEST UPDATE : 

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!

TG News : తెలంగాణలో రెండో రోజు రాజకీయ రచ్చ.. నేతల మధ్య మాటల యుద్ధం..!

Rythu Barosa : రైతులకు శుభవార్త, రైతు భరోసాపై క్లారిటీ.. వారికి మాత్రమే, మంత్రి తుమ్మల కీలక ప్రకటన..!

 Nalgonda : ప్రజాపాలన దినోత్సవం ఎప్పుడో తెలుసా.. జిల్లా కలెక్టర్ ప్రశ్నకు విద్యార్థుల సమాధానం..!

మరిన్ని వార్తలు