WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!

WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!
మన సాక్షి, హైదరాబాద్ :
మీరు వాట్సాప్ వినియోగిస్తున్నారా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరు వాట్సప్ వినియోగిస్తుంటారు. వాట్సాప్ లో కొత్త రకం మోసం జరుగుతుందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచన చేశారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో కీలక అంశాలను పోస్ట్ చేశారు. ఎలా మోసం జరుగుతుందో.. ఎలా జాగ్రత్త ఉండాలో సూచించారు.
వాట్సాప్‌లో కొత్త మోసం… ‘ఘోస్ట్ పేయిరింగ్’తో జాగ్రత్త!
“హేయ్.. మీ ఫొటో చూశారా?” అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయకండి.
ఇదొక ‘ఘోస్ట్ పేయిరింగ్’ (GhostPairing) స్కామ్.
ఆ లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఓటీపీ గానీ, స్కానింగ్ గానీ లేకుండానే.. మీకు తెలియకుండా మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్ అవుతుంది.
ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. మీ కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారు. చివరికి మీ ఖాతాను మీరే వాడలేకుండా లాక్ చేస్తారు.
అనుమానాస్పద లింక్‌లను అస్సలు క్లిక్ చేయవద్దు.
వాట్సాప్ సెట్టింగ్స్‌లో ‘Linked Devices’ ఆప్షన్‌ను తరచూ పరిశీలించండి. తెలియని డివైజ్‌లు ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.
Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోండి.
ఒక చిన్న అజాగ్రత్తతో మీ వాట్సాప్ మొత్తం హ్యాకర్ల పరమవుతుంది. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేసి అప్రమత్తం చేయండి.
MOST READ
-
Sarpanch : ఆపద వస్తే ఆదుకుంటా.. నూతన సర్పంచ్ ఆర్థిక సహాయం..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!
-
Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!
-
Online App : ఇక యూరియా కావాలంటే ఆన్ లైన్ యాప్ లో బుక్ చేసుకోవాల్సిందే.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!










