తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్

Scam Alert : మల్టీ లెవెల్ మార్కెటింగ్ గేటుగాళ్ల కొత్త ట్రిక్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

Scam Alert : మల్టీ లెవెల్ మార్కెటింగ్ గేటుగాళ్ల కొత్త ట్రిక్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

వివిధ రకాల స్కీమ్ ల పేరుతో కేటుగాళ్లు స్కాములకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అలెర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది మోసపోతూనే ఉన్నారు. అలాంటి వారు మోసపోకుండా ఉండాలంటే పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మరో కొత్త స్కాం… కేటుగాళ్లు కొత్త ట్రిక్ పాల్పడుతున్నారంటూ పోలీసులు ప్రజలను అలర్ట్ చేశారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాల్సిందే.

మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యవస్థలో కేటుగాళ్లు కొత్త ట్రిక్కును ఫాలో అవుతున్నారు అంటూ జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందుకు గాను తెలంగాణ పోలీస్ ట్విట్టర్ లో వివరాలతో పోస్ట్ చేశారు. ఈ స్కామ్ లో ప్రతి ఒక్కరూ ఆలర్ట్ గా ఉండాలని వారు పేర్కొన్నారు. ప్రొడక్ట్ ల పేరుతో చైన్ లింకు మార్కెటింగ్ ఉంటుందని, ఇంట్లో సామాన్లు, మెడిసిన్ కొంటె లాభాలు అంటూ మోసాలకు పాల్పడతారని వివరించారు.

గృహిణి లకు సదావకాశమంటూ ఊదరగొట్టే ప్రకటనలు చేయడంతో పాటు మీతో పాటు మరో నలుగురిని చేర్చుకోవాలంటూ బ్రెయిన్ వాష్ చేస్తారని పోలీసులు తెలిపారు. పేరు ఏదైనా అక్కడ జరిగేది పచ్చి మోసమే.. మల్టీ లెవెల్ మార్కెటింగ్ జోలికి వెళ్లొద్దు.. మీతో పాటు మరో నలుగురిని బలి చేయొద్దు అంటూ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇంట్లోనే ఉంటూ సంపాదించవచ్చునని ప్రకటనలను నమ్మి మోసపోవద్దని, మల్టీ లెవెల్ మార్కెటింగ్ మాయలో పడకండి అంటూ తెలంగాణ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇకనైనా ప్రజలు ఇలాంటి వాటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారని భావిస్తున్నారు.

MOST READ :

  1. Rythu Bharosa : రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు.. చెక్ చేసుకోండి.. బిగ్ అప్డేట్..!

  2. Rythu Bharosa : రైతు భరోసా.. వారు అలా.. వీరు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Nalgonda : వీళ్లు మామూలోళ్ళు కాదు.. పార్కింగ్ చేసిన లారీలు కనిపిస్తే మాయం..! 

  4. Holidays : ఫిబ్రవరిలో అన్ని సెలవులా.. ఎందుకో తెలుసుకుందాం..!

  5. Nalgonda : పోలీసు శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన యువతేజం..!

మరిన్ని వార్తలు