Nalgonda : రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం ఎన్.జి కళాశాల విద్యార్థి..!
Nalgonda : రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం ఎన్.జి కళాశాల విద్యార్థి..!
నల్లగొండ, మన సాక్షి:
నల్గొండ జిల్లా కేంద్రం లోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో బి. ఏ. తృతీయ సంవత్సరం చదువుతున్న వి. ధనుష్ తెలంగాణా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె రన్ లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందినట్లు ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ తెలిపారు.
గతంలో నల్గొండ జిల్లా స్థాయి 5కే రన్ పోటీల్లో మొదటి స్థానం పొందిన ధనుష్ రాష్ట్ర స్థాయి పోటీల్లో సైతం ప్రథమ స్థానం పొంది త్వరలో గోవాలో జరుగు జాతీయ స్థాయిలో 10కే రన్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ధనుష్ ను తెలంగాణా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 35వేల చెక్కు, మెమెంటోతో సత్కరించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధనుష్ ను అభినందించారు. కార్యక్రమంలో అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ డా. పిల్లి సురేష్ బాబు, వ్యాయామ అధ్యాపకులు మల్లేశం, పరీక్షల నియంత్రణాధికారి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. అనిల్ బొజ్జ, కోటయ్య, తెలుగు విభాగం అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, చరిత్ర విభాగం అధ్యక్షులు డా. భట్టు కిరీటం, అర్థశాస్త్ర విభాగం అధ్యక్షులు డా. మునిస్వామి ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
Miryalaguda : అధికార అండతో కోట్ల రూపాయల సీలింగ్ భూముల ఆక్రమణ.. రిజిస్ట్రేషన్ రద్దు చేసిన రెవెన్యూ అధికారులు..!
-
Miryalaguda : ఆర్డీవో సంతకం ఫోర్జరీ.. చెక్కులు డ్రా చేసిన వారిపై చర్యలకై వినతి..!
-
Aadhar Card : ఆధార్ కార్డు ట్యాంపరింగ్.. కొత్త తరహాలో సైబర్ మోసం..!
-
Komatireddy Venkatreddy : పది రోజులలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులోకి నీళ్లు.. మంత్రి కోమటిరెడ్డి..!









