TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునిర్మల జిల్లాపండుగలు

Nirmal : స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలు.. నేటికీ వందేళ్లు పూర్తి..!

Nirmal : స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలు.. నేటికీ వందేళ్లు పూర్తి..!

నిర్మల్, (మన సాక్షి)

శ్రీ సర్వజనిక్ గణేష్ మండలి కుమార్ గల్లి లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నేటికీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కుమార్ గల్లీలో సార్వజనిక్ గణేష్ సంఘంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. భైంసా పట్టణంలో పురాణ బజార్ కుమార్ గల్లీలోని అన్ని కులాలు కలిసి పూర్వం నుండి ఐక్యత తో గణపతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.

భైంసా పట్టణంలో గణపతి స్థాపన గోపాలకృష్ణ మందిరం బ్రాహ్మణ గల్లీలో, హాతి గణేష్ నాయిగల్లి లో, పురాణ బజార్ కుమ్మరి గల్లీలో మొదట స్థాపన చేసారు. బ్రిటిష్ పాలన, రజాకార్ పాలన ను అంతం చేయడానికి మన భారత దేశ ప్రజల జాగృతి కోసం, ఐక్యత కోసం స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తి తో అందరం కలిసి గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నాం.

ఈ గణపతి స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్బంగా గల్లి పెద్దల సలహాలు సూచనలు తీసుకొని గణపతి చరిత్ర తెలుసుకొని ఘనంగా ఉత్సవాలు జరుపుకుందామని సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భజనలు, ఇతర సంస్కృతి సంప్రదాయాలు రాబోయే తరాలకు తెలియజేయడానికి నిర్ణయించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షుడు మడుగుల సాయినాథ్. రామ్ లాల్. గంగాధర్. సత్యనారాయణ. సాయినాథ్. శివ కుమార్. గల్లి పెద్దలు మహిళలు చిన్నపిల్లలు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

BIG BREAKING : మాదాపూర్ లో ఉద్రిక్తత.. కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం..!

నల్లగొండ మున్సిపాలిటీకి అత్యుత్తమ గౌరవం.. దేశంలోనే రెండో స్థానం.. 25 లక్షల నగదు పురస్కారం..!

Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Nalgonda : నల్గొండలో వినాయకుడికి తొలి పూజ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి..!

మరిన్ని వార్తలు