Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం..!

మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ ఎస్ పి క్యాంప్ గ్రౌండ్ నందు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో నో హెల్మెట్ - నో పెట్రోల్ కార్యక్రమం నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ ఎస్ పి క్యాంప్ గ్రౌండ్ నందు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో నో హెల్మెట్ – నో పెట్రోల్ కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, డీఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పట్టణంలోని దాదాపు 500 మంది ద్విచక్ర వాహనదారులకు బీ ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ద్విచక్ర వాహనదారులు అందరితో కలిసి హెల్మెట్లు ధరించి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలలో ప్రయాణం చేసే వారు హెల్మెట్ ధరించడం ద్వారా వారి ప్రాణాలతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా కాపాడినవారు అవుతారు అని అన్నారు. హెల్మెట్లు ధరించడం ద్వారా కాలుష్యం నుంచి కూడా మనని మనం రక్షించుకోవచ్చు అని అన్నారు.

నేటి నుంచి పెట్రోల్ బంక్ లలో హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయకుండా పకట్బందిగా కట్టడి చేయడం జరుగుతుందని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

MOST READ 

  1. Nalgonda : మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాను జల్లడ పట్టిన నల్గొండ సిసిఎస్ పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాక్..!

  2. Suryapet : మంచినీళ్లు రాక రెండు నెలలు.. ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ వద్ద మహిళల నిరసన..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో కార్యాలయ రికార్డ్ అసిస్టెంట్ సస్పెండ్..!

మరిన్ని వార్తలు