Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవైద్యంహైదరాబాద్

Hyderabad : ఓబీసీలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి..! 

Hyderabad : ఓబీసీలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి..! 

నాచారం, మన సాక్షి :

రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయాలని, జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఢిల్లీకి బయలు దేరి వెళ్ళడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు.

ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న లింగంగౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చిన అగ్రకులాల వారికి (ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నవారికి) ఉద్యోగాలు వచ్చాయన్నారు.

TG News : తెలంగాణలో ఉద్యోగాల జాతర.. ఇంటర్ అర్హతతోనే వీఆర్వో ఉద్యోగాలు..! 

అగ్రకులాల జనాభా ఆరు శాతం ఉంటే వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, కానీ దేశవ్యాప్తంగా ఓబీసీల జనాభా 50% పైగా ఉంటుందని రిజర్వేషన్ల శాతం మాత్రం 27 శాతం మాత్రమే కనుక ఓబీసీలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని జాజుల డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తాటికొండ విక్రం బాలగోని బాలరాజు, ఐలి వెంకన్న కుల్కచర్ల శ్రీనివాస్,కుందారం గణేశ చారి ఈడిగ శ్రీనివాస్ నరసింహ నాయక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలు