Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆరోగ్యం

TG News : తెలంగాణలో ఉద్యోగాల జాతర.. ఇంటర్ అర్హతతోనే వీఆర్వో ఉద్యోగాలు..!

TG News : తెలంగాణలో ఉద్యోగాల జాతర.. ఇంటర్ అర్హతతోనే వీఆర్వో ఉద్యోగాలు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికీ 50వేల మందికి ఉద్యోగ నియామాక పత్రాలు అందజేశారు. అదే విధంగా రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసేందుకు గాను వీఆర్వో వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది.

అందుకు రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రానున్నది. అందుకు డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ అర్హతతోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8000 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది. 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులుగా కానున్నారు. 8000 ఉద్యోగాలను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

అర్హత

తెలంగాణలో కొత్తగా ప్రతి గ్రామ రెవిన్యూ పంచాయతీకి ఒక విఆర్ఓ ను నియమించనున్నారు. అందుకుగాను త్వరలో 8000 విఆర్ఓ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయునది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నది. అందుకుగాను ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ అర్హత గాని కలిగి ఉన్నవారు అర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదు సంవత్సరాల సడలింపు కూడా ఉంటుంది.

ఎంపిక విధానం, వేతనం :

గ్రామ రెవెన్యూ అధికారుల ఎంపికను రాత పరీక్ష ద్వారా నియమించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాలలో రాత పరీక్ష నిర్వహించడం ద్వారా ఈ ఎంపిక చేపడుతుంది. ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయల వేతనం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు అయినందున టిఏ, డిఏ హెచ్ఆర్ఏ అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

సిద్ధంగా ఉంచుకోవలసిన సర్టిఫికెట్లు :

దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు వారి సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంది. వాటిలో పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్లు ఉండాలి. వాటితోపాటు స్టడీ సర్టిఫికెట్లు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉండాలి. కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ఈ డబ్ల్యూ సర్టిఫికెట్ ఉండాలి.

MOST READ : 

మరిన్ని వార్తలు