Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే 7న యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభం..!

Miryalaguda : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే 7న యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో నిర్మించిన యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ను డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. యాదాద్రి ధర్మల్ ప్లాంట్ తోపాటు జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

మంగళవారం తన చాంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఏర్పాట్ల విషయమై జిల్లా అధికారులతో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి 7 వ తేదీన బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, నల్గొండ మెడికల్ కళాశాల ప్రారంభం, స్కిల్ సెంటర్ తదితర వాటిని ప్రారంభించి అనంతరం నల్గొండలోని నాగార్జున కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వివిధ కార్యక్రమాల వద్ద ఇన్చార్జి అధికారులు ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా బహిరంగ సభ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆమె ఆదేశించారు.

ఈ విషయమై ఆమె నీటిపారుదల శాఖ ,వైటీపీఎస్, మున్సిపల్ ,రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖల అధికారులతో ఏర్పాట్ల పై సమీక్షించారు .రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు తదుపరి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించడంతోపాటు, ఏర్పాట్లపై సూచనలను తీసుకొని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.

అదనపు కలెక్టర్ జి. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్ఓ అమరేందర్, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

MOST READ : 

మరిన్ని వార్తలు