Oil Palm : ఆయిల్ పామ్ సాగు, సంరక్షణ.. ఎంత ఆదాయం ఉంటుందో.. తెలుసుకుందాం..
తెలంగాణలో రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహించడంతో పాటు రైతులు అంతర పంటలు సాగు చేసుకుని అధికాదాయం పొందే అవకాశం ఉంది. ఆయిల్ ఫామ్ సాగు, సంరక్షణ, ఎంత ఆదాయం ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Oil Palm : ఆయిల్ పామ్ సాగు, సంరక్షణ.. ఎంత ఆదాయం ఉంటుందో.. తెలుసుకుందాం..!
మన సాక్షి :
తెలంగాణలో రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహించడంతో పాటు రైతులు అంతర పంటలు సాగు చేసుకుని అధికాదాయం పొందే అవకాశం ఉంది. ఆయిల్ ఫామ్ సాగు, సంరక్షణ, ఎంత ఆదాయం ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..
జువెనైల్ దశ :
- (మొదటి 3 సంవత్సరాలు) ఇది ఆయిల్ పామ్ మొక్క జీవితంలో అత్యంత కీలకమైన దశ.
ఈ సమయంలో మొక్కలో
* వేర్ల అభివృద్ధి
* ఆకుల విస్తరణ
* కాండం బలం
* మొత్తం మొక్క నిర్మాణం
అన్నీ ఈ దశలోనే ఏర్పడతాయి. అందువల్ల ఈ కాలంలో క్రమం తప్పకుండా నీటి వసతి మరియు సమతుల్య ఎరువుల వినియోగం తప్పనిసరి.
మొదటి 3 సంవత్సరాల్లో సరైన సంరక్షణ లేకపోతే :
- * మొక్క ఎదుగుదల తగ్గుతుంది
* ఆకుల విస్తరణ తక్కువగా ఉంటుంది
* భవిష్యత్తులో వచ్చే గెలల సంఖ్య మరియు బరువు తగ్గిపోతాయి
* మొత్తం జీవితకాల దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
కాపు / కోత దశ :
(4వ సంవత్సరం నుండి) 4వ సంవత్సరం నుండి గెలలు రావడం ప్రారంభమవుతుంది. కానీ మొదటి 3 సంవత్సరాల్లో జరిగిన లోపాన్ని తరువాత ఎక్కువ ఎరువులు లేదా నీరు ఇచ్చినా పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కాదు. అందుకే “ఆయిల్ పామ్‌లో మొదటి 3 సంవత్సరాల సంరక్షణే భవిష్యత్తు 25 సంవత్సరాల దిగుబడిని నిర్ణయిస్తుంది” అని చెప్పడం అతిశయోక్తి కాదు. అలాగే 4వ సంవత్సరం నుండి
- * సరైన పంట సస్యరక్షణ చర్యలు
* సమతుల్య పోషక నిర్వహణ
చేపడితే ఎకరాకు అధిక దిగుబడి మరియు మంచి ఆదాయం పొందవచ్చు.
సంక్షిప్తంగా :
ఎకరాకు మొదటి సంవత్సరం నుంచి 7 టన్నుల పైగా దిగుబడి తీస్తున్న రైతులు అందరూ చెప్పే ఒకే సూచన. ఆదాయం వచ్చే 4వ సంవత్సరం వరకు వేచి ఉండకుండా, మొక్క నాటిన మొదటి రోజు నుండే క్రమం తప్పకుండా నీరు మరియు ఎరువులు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే
✅ అధిక దిగుబడి
✅ స్థిరమైన ఆదాయం పొందగలం.
కాబట్టి లేత దశలో మొక్క ఎదుగుదలకు సహకరిస్తే, కాపు దశలో అధిక దిగుబడి పొందడం సాధ్యం.అందువల్ల ఈ రెండు దశల్లో కూడా సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం తప్పనిసరి.
By :
డా.రంగు ముత్యం రాజు,
ఉద్యాన విస్తరణ అధికారి, కోదాడ









