Breaking Newsఆంధ్రప్రదేశ్పండుగలు
సంక్రాంతి వేళ.. కోడిపందాల్లో రికార్డ్, రూ.1.53 కోట్ల భారీ పందెం..!
సంక్రాంతి పండుగ వేళ రికార్డు స్థాయిలో కోడిపందాలు సాగాయి. ఒక కోటి 53 లక్షల రూపాయల భారీ కోడి పందెం నిర్వహించారు.

సంక్రాంతి వేళ.. కోడిపందాల్లో రికార్డ్, రూ.1.53 కోట్ల భారీ పందెం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
సంక్రాంతి పండుగ వేళ రికార్డు స్థాయిలో కోడిపందాలు సాగాయి. ఒక కోటి 53 లక్షల రూపాయల భారీ కోడి పందెం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోడిపందాలు జోరందుకున్నాయి.
పైబోయిన వెంకటరామయ్య బరిలో గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేష్ కోళ్ల మధ్య భారీ కోడిపందెం సాగింది. పందెం గెలిచిన రాజమండ్రి రమేష్ ఒక కోటి 53 లక్షల రూపాయలను సొంతం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొత్తంలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద పందెం అని స్థానికులు పేర్కొంటున్నారు.
MOST READ NEWS
Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా పై కీలక అప్డేట్..!
ప్రేమ పెళ్లి పై సుప్రీంకోర్టు జస్టిస్ కీలక వ్యాఖ్యలు..!









