TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : సంక్రాంతి పండుగ వేళ.. తగ్గిన బంగారం ధర..!

Gold Price : సంక్రాంతి పండుగ వేళ.. తగ్గిన బంగారం ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

సంక్రాంతి పండుగకు బంగారం ధర తగ్గింది. ఇంతకాలం పాటు ప్రతిరోజు పెరుగుతూ వచ్చిన బంగారం ధర పండుగ రోజు 100 గ్రాములకు 1100 రూపాయలు తగ్గింది.

సోమవారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు ఎనిమిది లక్షల ఏడువందల రూపాయలు ఉండగా మంగళవారం 1100 రూపాయలు తగ్గి 7,99,600 రూపాయలుగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ బంగారం సోమవారం 7 లక్షల 34 వేల రూపాయలు ఉండగా వెయ్యి రూపాయలు తగ్గి మంగళవారం 7 లక్షల 33 వేల రూపాయలుగా ఉంది.

హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం సంక్రాంతి పండుగ రోజు మంగళవారం 22 క్యారెట్స్ 73,300 రూపాయలు ఉంది. 24 క్యారెట్స్ బంగారం 79,960 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో కూడా ఆవే ధరలు ఉన్నాయి.

Similar News : 

మరిన్ని వార్తలు