Gold Price : మరోసారి భారీగా పెరిగిన గోల్డ్.. ఈరోజు ధర ఎంతంటే..!
Gold Price : మరోసారి భారీగా పెరిగిన గోల్డ్.. ఈరోజు ధర ఎంతంటే..!
మన సాక్షి. తెలంగాణ బ్యూరో :
బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. నూతన సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి వరుసగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. దానికి తోడు అమెరికాలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కావడం కూడా కారణమే అంటున్నారు పరిశీలకులు.
బంగారం ధర మరింతగా పెరుగుతుందని మహిళలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు.. శుక్రవారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారంకు 3300 రూపాయలు పెరిగింది.
గురువారం 100 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ 8,20,900 రూపాయలు ఉండగా 3300 పెరిగి శుక్రవారం 8,24,200 చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాములు బంగారం గురువారం 7,52, 500 రూపాయలు ఉండగా శుక్రవారం 3000 రూపాయలు పెరిగి 7,55,500 రూపాయలకు చేరింది.
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం 22 క్యారెట్స్ 75 వేల 550 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 82,420 ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో అవే ధరలు కొనసాగుతున్నాయి.









