Gold Price : మరోసారి కుప్పకూలిన బంగారం ధర.. తులం రూ.56 వేల దారిలో..!

Gold Price : మరోసారి కుప్పకూలిన బంగారం ధర.. తులం రూ.56 వేల దారిలో..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వరుసగా నాలుగు రోజుల నుండి బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాల వల్ల బంగారం ధరలు పడిపోతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు నేలచూపులు చూస్తుండగా మరికొద్ది రోజుల్లో కూడా భారీగా తగ్గే సూచనలు ఉన్నాయని, తులం బంగారం 56 వేల రూపాయలకే చేరుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
మంగళవారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారంకు 6800 తగ్గింది. హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 6800 తగ్గి 8,97,300 రూపాయలకు చేరింది. అదేవిధంగా 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం కు 6000 రూపాయలు తగ్గి ₹8,22,500 రూపాయలకు చేరింది.
ఈరోజు తులం ఎంతంటే..?
హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం బంగారం కొనుగోలు చేసే వారికి మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయంటే.. 22 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం కు 82,250 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం కు 89,730 రూపాయలు ఉంది. ఏప్రిల్ మాసంలో శుభకార్యాలు ఉన్నందున తగ్గుతున్న ధరలతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.









