సూర్యాపేట: విద్యుత్తు తీగల చోరీకి వెళ్ళి ఒకరు మృతి

విద్యుత్తు తీగల చోరీకి వెళ్ళి ఒకరు మృతి

పోలీసుల అదుపులో మరో ఇద్దరు

సూర్యాపేట రూరల్,  అక్టోబర్ 25, మనసాక్షి: విద్యుత్తు తీగల చోరీకి వెళ్లి విద్యుత్ ఘాతానికి గురైన ఒకరు మృతి చెందిన సంఘటన పిల్లలమర్రి శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.  సూర్యాపేట రూరల్ ఎస్సై ఆర్ సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం..

పెన్ పహాడ్ మండలం కేంద్రానికి చెందిన ఒగ్గుప్రేమ్ (24) కోట సతీష్, మేరీగ గణేష్ లు సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై సూర్యాపేట మండలంలోనిపిల్లలమర్రి శివారు కు బయలుదేరారు. పిల్లలమర్రి శివారులోని ఎం జె ఆర్ కంపెనీకి విద్యుత్తు సరఫరా లేకుండా నిరుపయోగంగా ఉన్న 33 కెవి లైన్ ఉంది దాసరి సత్యం పొలంలో ఉన్న33 కెవి లైన్ తీయగా కట్ చేయడానికి విద్యుత్ స్తంభాన్ని ఓగ్గు ప్రేమ్ ఎక్కాడు. ప్రేమ్ విద్యుత్ తీగలను కట్ చేయడంతో క్రింది భాగంలో ఉన్న మరో లైన్ కు తగిలింది . దీంతో ఒక్కసారిగా స్తంభం పై ఉన్న ప్రేమ కరెంట్ షాక్ తో పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న ప్రేమను కోట సతీష్, మేరీగ గణేష్ లు ద్విచక్ర వాహనంపై తీసుకొని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోకి వచ్చేసరికి మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని సూర్యాపేట రూరల్ ఎస్సై ఆర్ సాయిరాం తెలిపారు. మృతుని తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

విద్యుత్ శాఖ ఏఈ ఫిర్యాదు

పిల్లలమర్రి శివారులోని 33 కెవి ఎం జె ఆర్ ఫ్యాక్టరీ కి వెళ్లే లైన్ లైన్ 8 స్తంభాల విద్యుత్ తీగలు దొంగిలించినట్లు సూర్యాపేట మండల విద్యుత్ శాఖ ఏఈ అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. సూర్యాపేట రూరల్ పోలీసుల ఫిర్యాదు చేశారు ఉదయం లైన్మెన్ కురువ నాయక్ కు రైతుని ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి చూశాడు. బురకపిట్ట తండా భాషా నాయక్ తండపిల్లల మర్రి వైపు వచ్చే విద్యుత్తు సరఫరా రావడం లేదని లైన్ మెన్ గ్రహించారు. లైన్మెన్ అక్కడికి వెళ్లి చూడగా విద్యుత్ తీగల కోసినట్లు ఉండడం జరిగిందని మా దృష్టికి తీసుకు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం సూర్యాపేట రూరల్ ఎస్సై ఆర్ సాయిరాం కుఫిర్యాదు చేసినట్లు ఏఈఅనిల్ కుమార్ తెలిపారు.