యువకుని బలవన్మరణం – latest news

యువకుని బలవన్మరణం

మందమర్రి, సెప్టెంబర్ 25 మన సాక్షి: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ కు చెందిన వాజిద్ (28) అనే యువకుడు శనివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వాజిద్ గతంలో మందమర్రి మార్కెట్ లో రుచి బేకరీ నిర్వహిస్తు పట్టణ ప్రజలందరికీ సుపరిచితుడే. అనంతరం బేకరీ వ్యాపారాన్ని వదులుకొని, ప్రస్తుతం లారీ కొనుగోలు చేసి, జీవిస్తున్నాడు. వాజిద్ మరణానికి గల పూర్తి కారణాలు తెలియరాలేదు. మృతుడి భార్య ప్రస్తుతం 7నెలల గర్భిణీ, మృతుడిపై అతని భార్య, అతని తల్లిదండ్రులు, పెళ్లి కానీ చెల్లెలు ఆధారపడి ఉన్నారు.

వాజిద్ మరణంతో వారి రోదనలు చూసేవారి హృదయాలను కలిచివేశాయి. వాజిద్ మరణ వార్తా దావనంలో పట్టణంలో వ్యాపించడంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు మందమర్రి పోలీసులు కేసు, నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.